AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: పుష్ప 2 పై క్రేజీ న్యూస్‌.. సంక్రాంతి కంటే ముందుగానే రిలీజ్‌.. ఆ డేట్‌నే ఫైనల్‌ చేయనున్న సుకుమార్

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా మారిపోయాడు టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను కొల్లగొట్టింది. ఇదే సినిమాలో నేషనల్‌ క్రష్‌గా క్రేజ్‌ తెచ్చుకుంది రష్మిక మందన్నా. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌ రానుంది. 'పుష్ఫ 2 ది రూల్‌' అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్‌ చాలా భాగం పూర్తయ్యింది.

Pushpa 2: పుష్ప 2 పై క్రేజీ న్యూస్‌.. సంక్రాంతి కంటే ముందుగానే రిలీజ్‌.. ఆ డేట్‌నే ఫైనల్‌ చేయనున్న సుకుమార్
Pushpa 2 Allu Arjun
Basha Shek
|

Updated on: May 29, 2023 | 7:21 PM

Share

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా మారిపోయాడు టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను కొల్లగొట్టింది. ఇదే సినిమాలో నేషనల్‌ క్రష్‌గా క్రేజ్‌ తెచ్చుకుంది రష్మిక మందన్నా. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌ రానుంది. ‘పుష్ఫ 2 ది రూల్‌’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్‌ చాలా భాగం పూర్తయ్యింది. ఇటీవలే విడుదలైన అల్లు అర్జున్‌ లుక్‌కు సంబంధించిన పోస్టర్లకు సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో పుష్ప 2 పై అంచనాలు మరింత పెరిగాయి. అయితే తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకొంటోన్న పుష్ప 2ను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుందని టాక్‌ వినిపించింది. అయితే ఇప్పుడు రిలీజ్‌ టైమ్‌ మారినట్లు సమాచారం. సంక్రాంతి కంటే ముందుగానే అంటే ఈ ఏడాది డిసెంబర్‌లోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట.  ఒక వేళ ఇది గనక నిజమైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పుకోవచ్చు.

కాగా అన్నీ కుదిరితే డిసెంబర్‌ 22న పుష్ప 2 సినిమాను రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నారట దర్శక నిర్మాతలు. కాగా పుష్ప పార్ట్‌ 1 కూడా డిసెంబర్‌లోనే విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. కాబట్టి సీక్వెల్‌ను కూడా డిసెంబర్‌లో రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారట మేకర్స్‌. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ రానుంది. పుష్ప సినిమాలో ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్​, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే సినిమాతో తన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్‌ చేసుకున్నట్లు వెల్లడించారు ఫహద్‌ ఫాసిల్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు రాక్‌ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us