Sonu Sood: మరో మంచి పనికి సోనూసూద్‌ శ్రీకారం.. అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్‌ స్కూల్‌ నిర్మించనున్న రియల్ హీరో

బిహార్‌లోని కతిహార్‌కు చెందిన బీరేంద్ర కుమార్ మహ అనే ఇంజినీర్ సోనూ సూద్ పేరు మీద ఒక స్కూల్‌ను నిర్మించారు. ఇందుకోసం తన ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టాడు. కేవలం అనాథ పిల్లల కోసమే ఈ పాఠశాలను నిర్మించారు. తాజాగా ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్.. ఇటీవల ఆ ఇంజినీర్‌ను కలిశారు.

Sonu Sood: మరో మంచి పనికి సోనూసూద్‌ శ్రీకారం.. అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్‌ స్కూల్‌ నిర్మించనున్న రియల్ హీరో
Sonu Sood
Follow us
Basha Shek

|

Updated on: May 29, 2023 | 8:53 PM

సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రల్లో కనిపించే నటుడు సోనూసూద్ నిజ జీవితంలో హీరో అని అందరికీ తెలుసు. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందుకొస్తాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. కొవిడ్‌ కాలంలో సోనూసూద్‌ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలు అతనిని రియల్‌ హీరోగా మార్చేశాయి. ఆ సమయంలో కోట్లాది రూపాయలు ఖర్చుచేసి వలస కూలీలను వారివారి ప్రాంతాలకు తరలించాడు సోనూసూద్‌. కొవిడ్‌ ముగిశాక కూడా తన సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేశాడు. ప్రత్యేకంగా ఒక ఫౌండేషన్‌ను నెలకొల్పి పేద పిల్లల చదువులకు ఆర్థిక సహాయం అందించాడు. చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి వారి తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు నింపాడు. తాజాగా అనాథ పిల్లల కోసం మరో పనికి శ్రీకారం చుట్టాడు సోనూసూద్‌. వివరాల్లోకి వెళితే.. బిహార్‌లోని కతిహార్‌కు చెందిన బీరేంద్ర కుమార్ మహ అనే ఇంజినీర్ సోనూ సూద్ పేరు మీద ఒక స్కూల్‌ను నిర్మించారు. ఇందుకోసం తన ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టాడు. కేవలం అనాథ పిల్లల కోసమే ఈ పాఠశాలను నిర్మించారు. తాజాగా ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్.. ఇటీవల ఆ ఇంజినీర్‌ను కలిశారు. ఈ పాఠశాలకు అనుబంధంగా మరో కొత్త భవనాన్ని నిర్మించి మరింత మంది నిరుపేద పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించాలని సోనూ సూద్ నిర్ణయించుకున్నాడు. దీనికోసం సోనూ సూద్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్‌ను నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా బీరేంద్ర కుమార్‌ నెలకొల్పిన పాఠశాలలో మొత్తం 110 మంది పిల్లలకు ఉచిత విద్య, వసతి, ఆహారం అందుతోంది. ఈ 110 పిల్లలకు ఆ పాఠశాలలోనే ప్రత్యేకంగా హాస్టల్‌ కూడా ఉంది. ఇటీవల ఈ పాఠశాలను సందర్శించిన సోనూసూద్‌ అక్కడి పిల్లలతో రోజంతా గడిపాడు. అనంతరం స్కూల్‌లో కొత్త బిల్డింగ్ నిర్మించాలని నిర్ణయించుకున్నారు. తద్వారా మరింత మంది పేద పిల్లలకు ఉచిత విద్య, ఆహారం అందించాలని డిసైడ్‌ అయ్యారు. కాగా సోనూ సూద్ ఇప్పటికే తన తల్లి పేరిట దేశంలో చాలా మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సుమారు 10 వేల మంది విద్యార్థులు సోనూ సూద్ సాయంతో చదువును అభ్యసిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ