OTT Movies: సినిమాల సందడి.. ఓటీటీలో ఒకే రోజు ఏకంగా 21 సినిమాల సందడి..
ఇప్పటికే చాలా సినిమాలు సిరీస్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్ కు వచ్చిన సినిమాలు నెల రోజుల గ్యాప్ లోనే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులకు ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో ఓటీటీ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీల్లో సినిమాల సందడి మాములుగా ఉండదు. ఇప్పటికే చాలా సినిమాలు సిరీస్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్ కు వచ్చిన సినిమాలు నెల రోజుల గ్యాప్ లోనే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులకు ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాయి. ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ వీకెండ్ లో కూడా ఓటీటీ లో సినిమా సందడి గట్టిగానే ఉండనుంది. సినిమాలు దాదాపు 21 కానున్నాయి. ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, సిరీస్ ల లిస్ట్ ఇదే.
ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది నాగ చైతన్య కస్టడీ గురించే. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు కస్టడీ, మై ఫాల్ట్ (హాలీవుడ్ సినిమా), మెన్ టు. సోనీ లివ్ లో 2018.
అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అవతార్ : ది వే ఆఫ్ వాటర్ , సెయింట్ ఎక్స్ , ఎంపైర్ ఆఫ్ లైట్, ఫ్లామిన్ హాట్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఆహా తమిళ్ లో మలై నేర మలిపో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ లో బర్రకుడ క్వీన్స్ ..( జూన్ 5), ఆర్నార్డ్ ..( జూన్ 7), నెవర్ హావ్ ఐ ఎవర్ .. (జూన్ 8), టూర్ డి ఫ్రాన్స్ .. (జూన్ 8). జీ5లో ది ఐడల్ .. (జూన్ 5), గునెగార్, కోయి బాత్ చలే, కుసుమ్ మనోహర్ లేలే. అలాగే జియో సినిమాలో బ్లడీ డాడీ, యూపీ 65.ఇక బుక్ మై షోలో పొలైట్ సొసైటీ, ది హనీమూన్ స్ట్రీమింగ్ కానున్నాయి.