AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bichagadu 2: ఓటీటీలోకి బిచ్చగాడు 2.. ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..

ఇక ఇటీవలే ఈ సినిమాకు సీక్వెల్ తీసుకొచ్చారు. బిచ్చగాడు 2 సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేశారు విజయ్. తమిళంతోపాటు.... తెలుగు, కన్నడ, మలయాళంలో విడుదలై అదరగొట్టింది. మొదట అమ్మ సెంటిమెంట్.. ఇప్పుడు చెల్లి సెంటిమెంట్ తో అడియన్స్ ను కంటతడి పెట్టించాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా స్ట్రీమింగ్ పార్ట్ నర్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Bichagadu 2: ఓటీటీలోకి బిచ్చగాడు 2.. ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..
Bichagadu 2
Rajitha Chanti
|

Updated on: Jun 09, 2023 | 7:52 PM

Share

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన తమిళ్ చిత్రాల్లో బిచ్చగాడు ఒకటి. కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగులోకి డబ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు విజయ్. ఈ సినిమాకు ఊహించనంత రెస్పాన్స్ రావడమే కాదు.. భారీగా వసూళ్లు రాబట్టింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ ఆంటోనికి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఇటీవలే ఈ సినిమాకు సీక్వెల్ తీసుకొచ్చారు. బిచ్చగాడు 2 సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేశారు విజయ్. తమిళంతోపాటు…. తెలుగు, కన్నడ, మలయాళంలో విడుదలై అదరగొట్టింది. మొదట అమ్మ సెంటిమెంట్.. ఇప్పుడు చెల్లి సెంటిమెంట్ తో అడియన్స్ ను కంటతడి పెట్టించాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా స్ట్రీమింగ్ పార్ట్ నర్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

లేటేస్ట్ అప్టేట్ ప్రకారం బిచ్చగాడు 2 సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుందట. తెలుగుతోపాటు తమిళ్ హాక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను జూన్ 17 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ సినిమాకు తమిళంలో కంటే తెలుగులోనే భారీగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తెలుగులో 1.8 కోట్లు వసూలు చేయగా.. తమిళంలో 15 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ చిత్రంలో దేవ్ గిల్, హరీష్ పెరడి, జాన్ విజయ్, రాధా రవి, మన్సూర్ అలీ ఖాన్, వైజీ మహేంద్రన్, రాజా కృష్ణమూర్తి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు విజయ్ ఆంటోనీ. ఆయన దర్శకత్వంతో పాటు సంగీతాన్ని అందిస్తూ ఎడిటింగ్ బాధ్యతలూ చూసుకున్నారు. ఇందులో విజయ్ సరసన కావ్యథాపర్ నటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?