Adipurush: సీత పాత్రలో జీవించి తరించిపోయాను.. కానీ కృతి సనన్ ఈ జనరేషనే కదా..దీపిక చిఖిల..

ప్రీ రిలీజ్ ఈవెంట్ మరుసటి రోజు చిత్రయూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. డైరెక్టర్ ఓంరౌత్, హీరోయిన్ కృతిసనన్, మిగతా టీం సభ్యులు అర్చనా సమయంలో శ్రీవారిని దర్శించుకుని వెళ్లి పోతున్న సమయంలో డైరెక్టర్ ఓంరౌత్ హీరోయిన్ కృతి సనన్ ను హత్తుకుని బుగ్గుపై ముద్దుపెట్టి సాగనంపాడు. ఆలయ ప్రాంగణంలో అనుచింతగా ప్రవర్తించడంతో వీరి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తులు.

Adipurush: సీత పాత్రలో జీవించి తరించిపోయాను.. కానీ కృతి సనన్ ఈ జనరేషనే కదా..దీపిక చిఖిల..
Dipika Chikhila
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 09, 2023 | 4:16 PM

మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఆదిపురుష్ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను తిరుపతిలో గ్రాండ్ గా నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు దాదాపు లక్ష మందికి పైగా అభిమానులు విచ్చేయగా.. అంగరంగ వైభవంగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.అయితే అదే సమయంలో ఈ సినిమా చిక్కుల్లో పడింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ మరుసటి రోజు చిత్రయూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. డైరెక్టర్ ఓంరౌత్, హీరోయిన్ కృతిసనన్, మిగతా టీం సభ్యులు అర్చనా సమయంలో శ్రీవారిని దర్శించుకుని వెళ్లి పోతున్న సమయంలో డైరెక్టర్ ఓంరౌత్ హీరోయిన్ కృతి సనన్ ను హత్తుకుని బుగ్గుపై ముద్దుపెట్టి సాగనంపాడు. ఆలయ ప్రాంగణంలో అనుచింతగా ప్రవర్తించడంతో వీరి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తులు. ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరల్ కావడంతో కృతిసనన్, ఓంరౌత్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

తాజాగా ఈ వివాదం పై అలనాటి నటి దీపిక చిఖిల స్పందించారు. “నేటి కాలంలో ముద్దుపెట్టుకోవడం.. కౌగిలించుకోవడం మంచి సాంప్రదాయమనుకుంటున్నారు. ఇక కృతిసనన్ కూడా ఈ జనరేషన్ హీరోయినే కదా.. అందుకే ఆమె సీత పాత్రలో లీనమైపోలేదు. కేవలం తాను పాత్ర పోషిస్తున్నాను అనుకుంది. ఇప్పటితరం వాళ్లు ఆ పాత్ర ఎమోషన్స్ పట్టుకోలేరు. వారికి అందులో ఎంతగా జీవించిపోవాలో తెలియదు. అలాంటివారికి రామాయణం అంటే కేవలం ఒక సినిమా మాత్రమే. ఆధ్యాత్మికంగా ఆ సినిమాతో వారు కనెక్ట్ కాలేరు. గతంలో నేను సీత పాత్రలో చేశాను.. కానీ అందులో జీవించి తరించిపోయాను. ఇప్పటితరం కేవలం పాత్రలాగే చూస్తారు. సినిమా అయిపోయాక.. తన రోల్ అయిపోయిందని ఫీల్ అవుతారు.

ఇవి కూడా చదవండి

అప్పట్లో పౌరాణిక చిత్రాల్లో నటించేవాళ్లను కనీసం పేరు పెట్టి కూడా పిలిచేవారు కాదు. అలాంటి దేవుళ్ల పాత్రలు చేస్తున్నప్పుడు ఎంతోమంది వచ్చి మా కాలికి నమస్కరించేవారు. మమ్మల్ని నటులుగా కాకుండా నిజమైన దేవుళ్లుగా భావించేవారు. హగ్గులకు, ముద్దులకు ఆస్కారమే ఉండేది కాదు. ఆదిపురుష్ సినిమా రిలీజ్ కాగానే అందులో పనిచేసినవాళ్లంతా సినిమాను మర్చిపోయి మరో ప్రాజెక్ట్ లో బిజీ అవుతారు. కానీ అప్పట్లో అలా కాదు. అప్పట్లో మమ్మల్ని దేవుళ్లుగా చూసుకునేవారు. అందుకే ప్రజల మనోభావాలను దెబ్బతీసే పనులు మేం ఎప్పుడూ చేయలేదు.” అంటూ చెప్పుకొచ్చారు.

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..