RRR Movie: రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ అద్భుతం.. వారితో కలిసి పనిచేయాలని ఉంది.. హాలీవుడ్ నటుడు క్రిస్ హేమ్స్వర్త్..
వీరిద్దరి అద్భుతమైన నటనకు హాలీవుడ్ మేకర్స్ ముగ్దులయ్యారు. తారక్, చెర్రీ నటనపై ఇప్పటికే హాలీవుడ్ స్టార్స్, దర్శకులు ప్రశంసలు కురిపించారు. ఇటీవలే స్పైడర్ మ్యాన్ నటుడు టామ్ హాలండ్ ఆర్ఆర్ఆర్ సినిమా తనకు తెగ నచ్చేసిందని చెప్పాడు. తాజాగా మార్వెల్ స్టార్ క్రిస్ హేమ్స్ వర్త్ సైతం ఈసినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఒక్క సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దర్శకనిర్మాతలను, సినీప్రియులను మెప్పించారు డైరెక్టర్ రాజమౌళి. ఆయన దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం గురించి చెప్పక్కర్లేదు. రూ. 600 కోట్ల బడ్జెట్తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం రికార్డ్స్ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుని హిస్టరీ బ్రేక్ చేసింది. ఇక ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి చెప్పక్కర్లేదు. వీరిద్దరి అద్భుతమైన నటనకు హాలీవుడ్ మేకర్స్ ముగ్దులయ్యారు. తారక్, చెర్రీ నటనపై ఇప్పటికే హాలీవుడ్ స్టార్స్, దర్శకులు ప్రశంసలు కురిపించారు. ఇటీవలే స్పైడర్ మ్యాన్ నటుడు టామ్ హాలండ్ ఆర్ఆర్ఆర్ సినిమా తనకు తెగ నచ్చేసిందని చెప్పాడు. తాజాగా మార్వెల్ స్టార్ క్రిస్ హేమ్స్ వర్త్ సైతం ఈసినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తాజాగా థోర్ నటుడు క్రిస్ హేమ్స్ వర్త్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎక్స్ ట్రైక్షన్ సీక్వెల్ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఎక్స్‌ట్రాక్షన్ 2 జూన్ 16న విడుదల కానుంది. సామ్ హర్‌గ్రేవ్ దర్శకత్వం వహించిన చిత్రం విజయవంతమైంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ రాబోతుంది. ఈ సినిమా ప్రమోషనల్లో భాగాంగ క్రిస్ హేమ్స్ వర్త్ మాట్లాడుతూ.. ఇటీవలే తాను ఆర్ఆర్ఆర్ సినిమాను చూశానని.. ఎస్ఎస్ రాజమౌళి ఇన్ క్రెడిబుల్ అని అన్నారు. అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన అద్భుతమని.. వారిద్దరితో కలిసి పనిచేయాలని ఉందంటూ తన మనసులోని కోరికను బయటపెట్టారు.




ఇదిలా ఉంటే.. క్రిస్ హేమ్స్ వర్త్ కు మనదేశంలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన ఎక్స్‌ట్రాక్షన్ 2 జూన్ 16న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది.
Good to have @idriselba join the Extraction team ?#Extraction2 drops next Friday! pic.twitter.com/2ekg9wcpDY
— Chris Hemsworth (@chrishemsworth) June 5, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




