Vijay Antony: ఓటీటీ ఆడియెన్స్‌కు విజయ్‌ ఆంటోని డబుల్‌ ట్రీట్‌.. ఒక్క రోజు గ్యాప్‌లో రెండు సినిమాల స్ట్రీమింగ్

హీరో, ప్రొడ్యూసర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌, గేయ రచయిత, ప్లే బ్యాక్‌ సింగర్‌.. ఇలా సినిమా ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్‌ పర్సన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్‌ ఆంటోని. తాజాగా బిచ్చగాడు-2 సినిమాతో మెగా ఫొన్‌ కూడా పట్టుకున్నాడు. డైరెక్టర్‌గా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

Vijay Antony: ఓటీటీ ఆడియెన్స్‌కు విజయ్‌ ఆంటోని డబుల్‌ ట్రీట్‌.. ఒక్క రోజు గ్యాప్‌లో రెండు సినిమాల స్ట్రీమింగ్
Vijay Antony Movies
Follow us
Basha Shek

|

Updated on: Jun 11, 2023 | 6:15 AM

హీరో, ప్రొడ్యూసర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌, గేయ రచయిత, ప్లే బ్యాక్‌ సింగర్‌.. ఇలా సినిమా ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్‌ పర్సన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్‌ ఆంటోని. తాజాగా బిచ్చగాడు-2 సినిమాతో మెగా ఫొన్‌ కూడా పట్టుకున్నాడు. డైరెక్టర్‌గా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. విజయ్‌ హీరోగా నటించిన బిచ్చగాడు-2 బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. తమిళంలో కంటే తెలుగులోనే ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు రావడం విశేషం. థియేటర్లలో అద్భుత విజయం సాధించిన బిచ్చగాడు -2 మూవీ త్వరలోనే ఓటీటీలో కూడా రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. మొదట జూన్‌ 23న విజయ్‌ ఆంటోని సినిమాను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఒక వారం ముందుగానే అంటే జూన్‌ 17న బిచ్చగాడు 2 డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్‌ ఓటీటీలో రిలీజ్‌ కానుంది.

అయితే బిచ్చగాడు 2 స్ట్రీమింగ్‌ కంటే ఒక రోజు ముందుగానే విజయ్‌ ఆంటోని నటించిన మరో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. అదే తమిళ రాసన్‌. ఏప్రిల్‌ 22న థియేటర్లలో రిలీజైన ఈ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌లో సురేష్‌గోపి, సోనూసూద్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు. అయితే థియేటర్లలో ఈ మూవీకి మిక్స్‌డ్ రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడిదే సినిమా ఓటీటీలోకి రానుంది. జీ5 ఓటీటీలో జూన్‌ 16న తమిళరాసన్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఇలా ఒక్క రోజు గ్యాప్‌లో తన రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్‌ చేసి విజయ్‌ ఆంటోని డబుల్‌ ట్రీట్‌ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?