Ileana: ప్రియుడి ఫోటో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసిన ఇలియానా.. అండగా నిలబడి కన్నీళ్లు తుడిచాడంటూ..
తెలుగులో ఆమెకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి మకా మార్చేసింది. అక్కడే బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ బిజీ అయ్యింది. కానీ అక్కడ కూడా ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గాయి. దీంతో సైలెంట్ అయిపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోస్ షేర్ చేస్తుంది. ఈ క్రమంలో తాను తల్లికాబోతున్నట్లు అనౌన్స్ చేసింది.
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగింది ఇలియానా. సన్నజాజిలాంటి నడుమందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దేవదాసు సినిమా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత స్టార్ హీరోస్ సరసన ఆడిపాడింది. అయితే తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన ఇలియానా.. అటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో ఆమెకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి మకా మార్చేసింది. అక్కడే బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ బిజీ అయ్యింది. కానీ అక్కడ కూడా ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గాయి. దీంతో సైలెంట్ అయిపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోస్ షేర్ చేస్తుంది. ఈ క్రమంలో తాను తల్లికాబోతున్నట్లు అనౌన్స్ చేసింది.
ఇక అప్పటి నుంచి బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేస్తూ మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. ఇటీవలే బేబీ బంప్ ఫోటో షేర్ చేస్తూ తన బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు రాసుకొచ్చింది. ఈ క్రమంలోనే పెళ్లెప్పుడు అయ్యిందని.. నీ భర్త ఎవరంటూ కామెంట్స్ చేశారు. అయితే తన ప్రేమ, పెళ్లి గురించి ఇప్పటికీ రియాక్ట్ కాలేదు. తాజాగా తన ప్రియుడిని పరిచయం చేసింది. తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది.
“ప్రెగ్నెన్సీ అనేది అందమైన వరం. నేనెప్పుడూ అనుకోలేదు నాకు ఆ అదృష్టం ఉందని.. ఇప్పుడు నేను మరింత అందంగా ఉన్నాను.. నా బేబీ బంప్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.. నేను త్వరలోనే నిన్ను కలవబోతున్నాను. ఒకప్పుడు కొన్ని రోజులు చెప్పలేనంత కష్టంగా ఉన్నాయి. ఆ సమయంలో అన్ని విషయాలు నిస్సహాయంగా అనిపించాయి. అప్పుడు నా కన్నీళ్లు తుడిచి నాకు తోడున్నావు.. నాకు అండగా నిలబడ్డాడు.. ఇప్పుడు ఏదీ అంత కష్టంగా అనిపించడం లేదు.నేను నీపట్ల ఎంతో ప్రేమగా ఉంటాను. చిన్న విషయానికి బలహీనంగా మారకుండా నేను బలంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ” అంటూ రాసుకొచ్చింది.
ఇదిలా ఉంటే.. గతంలో ఇలియానా ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ తో ప్రేమలో పడింది. అయితే కొద్ది కాలానికి వీరిద్దరు విడిపోయారు. ఇక ఇప్పుడు ఆమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ తో ఇలియానా ఎఫైర్ లో ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై ఇప్పటికీ వీరిద్దరు స్పందించలేదు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.