Upasana Konidela: వెల్కమ్ టూ కొణిదెల ఫ్యామిలీ.. కొత్త కొడలు లావణ్యకు స్వాగతం పలికిన ఉపాసన..
ఇక ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. మరోవైపు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ మెగా ఫ్యామిలీ మెంబర్స్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో చెర్రీ సతీమణి ఉపాసన సైతం కొత్త జంటకు విషెస్ తెలుపుతూ నెట్టింట ఆసక్తికర ట్వీట్ చేసింది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ హైదరాబాద్లో ఈనెల 9న గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. మణికొండలోని ఫామ్ బ్రీజ్ గేటేడ్ కమ్యూనిటీలోని నాగబాబు నివాసంలో జరిగిన ఈ వేడుకలో మెగా, అల్లు కుటుంబసభ్యులు.. సన్నిహితులు పాల్గొన్నారు. ఈ నిశ్చితార్థానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపానస, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇక ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. మరోవైపు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ మెగా ఫ్యామిలీ మెంబర్స్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో చెర్రీ సతీమణి ఉపాసన సైతం కొత్త జంటకు విషెస్ తెలుపుతూ నెట్టింట ఆసక్తికర ట్వీట్ చేసింది.
కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠికి వెల్ కమ్ చెబుతూ నిశ్చితార్థంలో దిగిన ఫోటోను షేర్ చేసింది. “వెల్కమ్ టూ కొణిదెల ఫ్యామిలీ మై డియరెస్ట్ లావణ్య.. రాబోయే నా తోడి కోడలి వేడుక కోసం ఎదురుచూస్తున్నా.. వరుణ్ నీతో చాలా సంతోషంగా ఉంటాడు” అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ సైతం లావణ్యకు విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు చరణ్ కూడా ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీ్ట్ చేశారు.
వరుణ్ తేజ్, లావణ్యత్రిపాఠి 2016 నుంచి ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరు కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించారు. మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయమే.. ఆ తర్వాత ప్రేమగా మారింది. వీరిద్దరి వివాహం ఈ ఏడాది చివర్లో జరగనున్నట్లు తెలుస్తోంది.
Welcome to the Konidela family dearest Lavanya ?❤️ Looking forward to celebrating my dearest thodi kodalu. Varunnnnnn soooooo happy for you. @Itslavanya @IAmVarunTej pic.twitter.com/69mMin4tXf
— Upasana Konidela (@upasanakonidela) June 10, 2023
Varun & Lavanya, love you guys. Heartiest congratulations. @IAmVarunTej @Itslavanya pic.twitter.com/PYynlbNt3h
— Ram Charan (@AlwaysRamCharan) June 10, 2023