Nandamuri Mokshagna: వారసుడోస్తున్నాడు.. మోక్షజ్ఞ న్యూలుక్ వైరల్.. అంతలోనే ఇంత మార్పా ?..

గతంలో బాలయ్య బర్త్ డే సందర్భంగా వీరసింహారెడ్డి షూటింగ్ సెట్ లో మోక్షజ్ఞ కనిపించిన సంగతి తెలిసిందే. ఇక చాలా కాలం తర్వాత ఇప్పుడు మరోసారి మోక్షజ్ఞ ఫోటోస్ వైరలవుతున్నాయి. అయితే తాజాగా బాలయ్య వారసుడిని చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు బొద్దుగా కనిపించిన అబ్బాయి.. ఇప్పుడు స్లిమ్‏గా.. మరింత అందంగా కనిపిస్తున్నాడు.

Nandamuri Mokshagna: వారసుడోస్తున్నాడు.. మోక్షజ్ఞ న్యూలుక్ వైరల్.. అంతలోనే ఇంత మార్పా ?..
Nandamuri Mokshagna
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 11, 2023 | 12:29 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ అరంగేట్రం కోసం నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య వారసుడి ఎంట్రీ కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇన్నాళ్లు సోషల్ మీడియాకు.. సినీవేడుకలకు దూరంగా ఉన్న మోక్షజ్ఞ.. ఇప్పుడిప్పుడే తండ్రి సినిమా షూటింగ్స్ సెట్లో కనిపిస్తున్నారు. గతంలో బాలయ్య బర్త్ డే సందర్భంగా వీరసింహారెడ్డి షూటింగ్ సెట్ లో మోక్షజ్ఞ కనిపించిన సంగతి తెలిసిందే. ఇక చాలా కాలం తర్వాత ఇప్పుడు మరోసారి మోక్షజ్ఞ ఫోటోస్ వైరలవుతున్నాయి. అయితే తాజాగా బాలయ్య వారసుడిని చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు బొద్దుగా కనిపించిన అబ్బాయి.. ఇప్పుడు స్లిమ్‏గా.. మరింత అందంగా కనిపిస్తున్నాడు. మొత్తానికి హీరో మెటిరియల్ గా మారిపోయాడంటూ కామెంట్స్ చేస్తూ ఫుల్ ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. ఇక మోక్షజ్ఞ లేటేస్ట్ ఫోటోస్ చూసి.. త్వరలోనే హీరోగా అరంగేట్రం చేయబోతున్నాడని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. బాలయ్య కెరీర్‏లోనే వన్ ఆఫ్ ది హిట్ మూవీ ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని ఎప్పటినుంచే ప్లాన్ చేస్తున్నారు బాలకృష్ణ. అయితే ఈ సినిమా సీక్వెల్ ల్లో హీరోగా మోక్షజ్ఞ నటించనున్నారని.. ఈ మూవీతోనే ఆయన తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు మోక్షజ్ఞ లుక్స్ విషయంలోనూ బాలయ్య మరింత కేర్ తీసుకున్నారని.. ఇప్పుడీ స్టైలీష్ లుక్ కారణమదే అంటున్నారు ఫ్యాన్స్. మొత్తానికి నందమూరి వారసుడి న్యూలుక్స్ చూసి ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్.

Mokshagna

Mokshagna

ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో కాజల్, శ్రీలీల నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ ఏడాది విజయదశమికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!