- Telugu News Photo Gallery Cinema photos Adipurush movie will be released in more than 6200 theaters across the country
Adipurush: మొదలైన ఆదిపురుష్ హంగామా.. ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుందో తెలిస్తే..
ప్రభాస్ రాముడి పాత్రలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా విడుదలపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. అత్యంత ప్రతిష్టాత్మకం తెరకెక్కిన ఈ సినిమాను జూన్ 16వ తేదీన విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా రికార్డు స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది..
Narender Vaitla | Edited By: Rajitha Chanti
Updated on: Jun 12, 2023 | 7:08 PM

ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్ సీతమ్మ పాత్రలో నటిస్తోంది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.

అత్యంత భారీ బడ్జెట్‌తో రామాయణ ఇతిహాసం నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్‌గా సీతగా కృతిసనన్ నటిస్తుండగా రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు.

తెలంగాణలో బుకింగ్‌కు సంబంధించి క్లారిటీ వచ్చినా ఏపీ సంగతి మాత్రం చెప్పలేదు. అయితే అక్కడ కూడా బుధవారం నుంచే బుకింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆదిపురుష్ చిత్రాన్ని దేశ్యాప్తంగా ఏకంగా 6200కి పైగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక్క హిందీలోనూ సుమారు 4000 స్క్రీన్స్‌లో ఆదిపురుష్ సందడి చేయనున్నట్లు సమాచారం. ఇక విడుదల తర్వాత ఈ సంఖ్య 6500కి చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.






























