Amit Shah: తెలంగాణకు అమిత్ షా పర్యటన రద్దు.. ఆ కారణం వల్లే

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. బిపర్‌జాయ్‌ తుపాను కారణంగా ఆయన పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని బండి సంజయ్ అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఆయన ఖమ్మంకు వచ్చే తేదీలను ప్రకటిస్తామని తెలిపారు.

Amit Shah: తెలంగాణకు అమిత్ షా పర్యటన రద్దు.. ఆ కారణం వల్లే
Amit Shah
Follow us
Aravind B

|

Updated on: Jun 14, 2023 | 4:12 PM

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. బిపర్‌జాయ్‌ తుపాను కారణంగా ఆయన పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని బండి సంజయ్ అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఆయన ఖమ్మంకు వచ్చే తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. ఈ నెల 15న ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహరంగ సభకు హాజరుకావాల్సి ఉంది. ఈ సభ ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తల్లో పూర్తిస్థాయిలో ఉత్సాహం నింపాలని బీజేపీ భావించింది. బిపర్‌జాయ్ తుఫాను రోజురోజుకు తీవ్ర రూపం దాల్చడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమిత్ షా ఈ తుపాను పరిస్థితులను దగ్గరుండి సమీక్షించనున్నారు.

ఇదిలా ఉండగా అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దవ్వడంతో బీజేపీ శ్రేణులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక.. ఆయన రావడం లేదని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక దశలో హైదరాబాద్‌కు రాకున్నా.. కనీసం ఖమ్మం సభకైనా ఆయన నేరుగా హాజరు అయితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

ఇవి కూడా చదవండి