Avika Gor: సౌత్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ అవికా గోర్.. నెపోటిజం ఎక్కువంటూ..

ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఓ సినిమా చేస్తుంది. ఆమె నటించిన 1920:Horrors of the Heart సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవికా.. తెలుగు సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Avika Gor: సౌత్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ అవికా గోర్.. నెపోటిజం ఎక్కువంటూ..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 12, 2023 | 5:16 PM

బుల్లితెరపై ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుని వెండితెరపైకి కథానాయికగా అడుగుపెట్టింది అవికా గోర్. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె.. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‏గా మారింది. యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. కానీ అవికాకు మాత్రం అంతగా అవకాశాలు రాలేదు. ఈ సినిమా తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ హీరోయిన్‏గా సక్సెస్ కాలేకపోయింది. తెలుగులోనే కాకుండా.. కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఓ సినిమా చేస్తుంది. ఆమె నటించిన 1920:Horrors of the Heart సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవికా.. తెలుగు సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

సౌత్ ఇండస్ట్రీలో నెపోటిజం ఎక్కువే అని అన్నారు. “స్టార్ పవర్ అంటేనే సౌత్. సౌత్ ఇండస్ట్రీలో స్టార్స్ మీదే సినిమాలు నడుస్తాయి. నెపోటిజం విని విని అలసిపోయిన మాట. ఇది దక్షిణాదిలో ఎక్కువే. కానీ ఇక్కడి ప్రేక్షకులు చూస్తున్నట్లు అక్కడి వాళ్లు చూడరు. ఇటీవల బాలీవుడ్ సినిమాపై తీవ్ర వివక్షత వచ్చేలా చేశారు. సౌత్ సినిమాలు చాలా రీమేక్ చేస్తూ బాలీవుడ్ వాళ్లు సౌత్ సినిమాలను కాపీ కొడతారు అనే స్థాయికి తీసుకొచ్చారు. దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగులో నెపోటిజం చాలా ఎక్కువే ఉంది. ప్రజలు కూడా దీన్ని బాగా హైప్ చేశారు. తర్వాత ఇది తగ్గుతుంది అనుకుంటున్నాను” అంటూ తెలిపింది.

అయితే ఇప్పుడు అవికా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో ఆమె పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. తెలుగు సినిమా ద్వారా కథానాయికగా వెండితెరకు పరిచయమైన అవికా.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీపై కామెంట్స్ చేయడం పై విమర్శలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.