Avika Gor: ‘నోటికి ఏది వస్తే అది మాట్లాడకు..’ దక్షిణాది సినీ పరిశ్రమపై హీరోయిన్‌ వైరల్ కామెంట్స్!

చిన్నారి పెళ్లికూతురు ఫేమ్‌ అవికా గౌర్‌ తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అడపాదడపా మువీల్లో హీరోయిన్‌గా నటిస్తూ రానిస్తుంది కూడా. ఐతే తాజాగా సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీపై ఈ అమ్మడు ఘాటు వ్యాఖ్యలు చేసి హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఈ బ్యూటీని ఏకిపారేస్తున్నారు...

Avika Gor: 'నోటికి ఏది వస్తే అది మాట్లాడకు..' దక్షిణాది సినీ పరిశ్రమపై హీరోయిన్‌ వైరల్ కామెంట్స్!
Avika Gor
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 12, 2023 | 9:56 PM

చిన్నారి పెళ్లికూతురు ఫేమ్‌ అవికా గౌర్‌ తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అడపాదడపా మువీల్లో హీరోయిన్‌గా నటిస్తూ రానిస్తుంది కూడా. ఐతే తాజాగా సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీపై ఈ అమ్మడు ఘాటు వ్యాఖ్యలు చేసి హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఈ బ్యూటీని ఏకిపారేస్తున్నారు. ఇంతకీ సంగతేమంటే.. ‘దక్షిణాది సినీ పరిశ్రమలో నెపోటిజం ఎక్కువ. అక్కడ స్టార్స్ పవర్ మీదనే ఇండస్ట్రీ నడుస్తోంది. అక్కడి ప్రేక్షకులు కూడా స్టార్స్ సినిమాలనే చూస్తారు. బాలీవుడ్‌తో పోల్చితే సౌత్ ఇండస్ట్రీలోనే నెపోటిజం ఎక్కువ. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో నెపోటిజం చాలా ఎక్కువగా చూపిస్తారు. బాలీవుడ్‌లో తెలుగు రీమేక్స్ మువీలను ఎక్కువ ఇష్టపడతారు. కానీ తెలుగులో తీసిన హిందీ సినిమాలను మాత్రం అస్సలు చూడరంటూ’ అవికా వ్యాఖ్యానించింది.

తాజాగా దక్షిణాది సినీ ఇండస్ట్రీపై అవికా చేసిన కామెంట్లకు నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ‘తెలుగులో సినిమాలు చేసి, మంచి గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు టాలీవుడ్‌పైనే కామెంట్లు చేయడం పద్దతి కాదు’ అని శుద్ధులు చెబుతున్నారు. ‘వార్తల్లో నిలవాలని నోటికి ఏది వస్తే అది మాట్లాడకు.. కథ నచ్చితేనే అభిమానులు థియేటర్లకు వెళ్తారు. అంతేగానీ నోటికి వచ్చినట్లు కామెంట్లు చేస్తే తెలుగులో ఎక్కువ రోజులు కనిపించవ్‌..’అంటూ మండిపడుతున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. చిన్నారి పెళ్లి కూతురు డబ్బింగ్‌ సీరియల్‌తో బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అవికా హీరోయిన్‌గా మాత్రం అంతగా రాణించలేకపోతోంది. ఉయ్యాలా జంపాల మువీతో తెలుగుతెరకు హీరోయిన్‌గా పరిచయమైన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతో హిట్‌ అందుకున్నా ఆ తర్వాత నటించిన సినిమాల్లో మాత్రం ఆశించిన విజయాలను అందుకోలేకపోయింది. దీంతో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?