Prabhu Deva: 50 ఏళ్ళ వయస్సులో నాలుగోసారి తండ్రి అయిన నటుడు..!

ప్రముఖ నటుడు, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ అయిన ప్రభు దేవా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన విలక్షణ డ్యాన్స్‌ మువ్‌మెంట్లతో ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా పేరుతెచ్చుకున్నాడు ప్రభుదేవా. తాజాగా ఆయన నాలుగోసారి..

Prabhu Deva: 50 ఏళ్ళ వయస్సులో నాలుగోసారి తండ్రి అయిన నటుడు..!
Prabhu Deva
Follow us

|

Updated on: Jun 11, 2023 | 5:14 PM

ప్రముఖ నటుడు, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ అయిన ప్రభు దేవా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన విలక్షణ డ్యాన్స్‌ మువ్‌మెంట్లతో ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా పేరుతెచ్చుకున్నాడు ప్రభుదేవా. తాజాగా ఆయన నాలుగోసారి తండ్రి అయ్యాడు. ప్రభుదేవా రెండో భార్య హిమాని సింగ్‌ ఆడపిల్లకు జన్మనిచ్చింది. ప్రభుదేవా మొదటి భార్య రమలత్‌ ద్వారా ఇప్పటికే ముగ్గురు కొడుకులకు తండ్రి అయ్యాడు. వీరి పెద్ద కొడుకు 2008 మృతి చెందాడు. ఆ తర్వాత కొంతకాలం లేడీ సూపర్‌స్టార్‌ నయన్‌తో ప్రేమాయణం సాగించాడు. దీంతో మొదటి భార్యతో విబేధాలు తలెత్తి 2011లో విడాకులు తీసుకున్నారు. నయన్‌, ప్రభుదేవా జంట పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.. కానీ అంతలోనే విడిపోయారు.

అనంతరం కొంతకాలంపాటు సింగిల్‌గా ఉన్నాడు. ముంబాయికి చెందిన సైకోథెరపిస్ట్‌ హిమాని సింగ్‌తో ప్రేమలోడి, 2020లో ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం చాలా రోజులు రహస్యంగా ఉంచినా, ఈ మధ్యనే తన రెండో పెళ్లి సంగతులు బయటపెట్టాడు. ఈ క్రమంలో హిమాని సింగ్‌ తాజాగా మొదటి సంతానానికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కూడా ప్రభుదేవా చాలా సీక్రెట్‌గా ఉంచాలనుకున్నట్లు సమాచారం. ఇకపోతే ప్రభుదేవా వయస్సు ప్రస్తుతం 50 ఏళ్లు. హాఫ్ సెంచరీకి మంచి గిఫ్ట్ వచ్చిందంటూ అభిమానులు నెట్టింట సందడి చేస్తున్నారు. దీనిపై ప్రభుదేవా ఇప్పటి వరకూ స్పందించలేదు.

కాగా డ్యాన్సర్‌, కొరియోగ్రాఫర్‌గా సినీరంగంలో అడుగుపెట్టిన ప్రభుదేవా.. లెజెండరీ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కించిన ప్రేమికుడు సినిమాలో తొలిసారిగా హీరోగా నటించాడు. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ.. హిట్లు అందుకున్నాడు. తెలుగునాట 2005లో విడుదలై ఘన విజయం సాధించిన ‘నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా’ మువీతో డైరెక్టర్‌గా కూడా మారాడు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో దాదాపు 12కుపైగా చిత్రాలకు డైరెక్టర్‌గా పనిచేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
మ్యాచ్‌లో ఉత్కంఠ క్షణాలు మిస్సయ్యారా.. ఈ హైలైట్స్‌ వీడియో చూడండి
మ్యాచ్‌లో ఉత్కంఠ క్షణాలు మిస్సయ్యారా.. ఈ హైలైట్స్‌ వీడియో చూడండి
ఏం తినేటట్టు లేదు.. కొండెక్కిన కూరగాయల ధరలు.. దిగిరానంటూ మారాం..!
ఏం తినేటట్టు లేదు.. కొండెక్కిన కూరగాయల ధరలు.. దిగిరానంటూ మారాం..!
400 ఆలయాలతో పేర్చినట్లు ఉండే గ్రామం ఎక్కడో తెలుసా?
400 ఆలయాలతో పేర్చినట్లు ఉండే గ్రామం ఎక్కడో తెలుసా?
అర్జునుడి పాత్ర కోసం విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఏంతంటే..
అర్జునుడి పాత్ర కోసం విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఏంతంటే..
పాలతో అందం పదిలం.. మచ్చలేని మెరిసే చర్మం కోసం ఇలా ట్రై చేయండి..!
పాలతో అందం పదిలం.. మచ్చలేని మెరిసే చర్మం కోసం ఇలా ట్రై చేయండి..!
మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: టీమిండియా క్రికెటర్లతో ప్రధాని
మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: టీమిండియా క్రికెటర్లతో ప్రధాని
రిపోర్టే కీలకం.. పోలవరానికి విదేశీ నిపుణుల బృందం..
రిపోర్టే కీలకం.. పోలవరానికి విదేశీ నిపుణుల బృందం..
రాత్రి పడుకునే ముందు కాళ్లు కడిగితే ఏమవుతుందో తెలుసా..?
రాత్రి పడుకునే ముందు కాళ్లు కడిగితే ఏమవుతుందో తెలుసా..?
టాలీవుడ్‌లోనే ఫేమస్ సింగర్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
టాలీవుడ్‌లోనే ఫేమస్ సింగర్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
ఇంట్లో బల్లుల బెడద..? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా తరిమికొట్టండి..
ఇంట్లో బల్లుల బెడద..? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా తరిమికొట్టండి..