Mangal Dhillon: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ సీనియర్ నటుడు కన్నుమూత
ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు మంగళ్ ధిల్లాన్ కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన లూథియానా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (జూన్ 11) మృతిచెందారు..
ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు మంగళ్ ధిల్లాన్ కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన లూథియానా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (జూన్ 11) మృతిచెందారు. జూన్ 18న మంగళ్ ధిల్లాన్ బర్త్‌డే ఉండగా.. సరిగ్గా వారం రోజుల ముందు తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
మంగళ్ ధిల్లాన్ పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ జిల్లాలో ఓ సిక్కు కుటుంబంలో జన్మించారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో చదువుకున్న ఆయన నటనపై ఆసక్తితో ఢిల్లీలోని ఓ థియేటర్‌లో పనిచేశాడు. ఆ తర్వాత 1980లో యాక్టింగ్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు పూర్తి చేసాడు. మంగళ్ మొదటిసారిగా 1986లో ‘కథా సాగర్’ అనే టీవీ షోలో నటించారు. అదే ఏడాది ‘బునియాద్’ అనే మరో టీవీ షోలో కనిపించాడు. ఆ తర్వాత జునూన్, కిస్మత్, ది గ్రేట్ మరాఠా, పాంథర్, ఘుటాన్, సాహిల్, మౌలానా ఆజాద్, ముజ్రిమ్ హజీర్, రిష్తా, యుగ్, నూర్జహాన్ వంటి పలుషోలకు పని చేశాడు.
అలాగే తన కెరీర్‌లో ఖూన్ భరీ మాంగ్, జఖ్మీ ఔరత్, దయావాన్, కహాన్ హై కానూన్, నాకా బండి, అంబా, అకాయ్లా, జనషీన్, ట్రైన్ టు పాకిస్థాన్, దలాల్ వంటి అనేక హిందీ, పంజాబ్ మువీలలో కూడా మంగళ్ ధిల్లాన్ నటించారు. చివరిగా 2017లో విడుదలైని ‘తూఫాన్ సింగ్’ సినిమాలో ఆయన కనిపించాడు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.