AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం.. మృతదేహాలను ఉంచిన స్కూల్‌ కూల్చివేత! ఎందుకంటే..

డిశా ఘోర రైలు ప్రమాదంలో 288 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వీరి మృత దేహాలను ఉంచిన స్థానిక పాఠాలను కూల్చివేస్తున్నట్లు బాలాసోర్ జిల్లా కలెక్టర్ దత్తాత్రయ భౌసాహెబ్ షిండే గురువారం మీడియాకు తెలిపారు..

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం.. మృతదేహాలను ఉంచిన స్కూల్‌ కూల్చివేత! ఎందుకంటే..
Bahana School Building
Srilakshmi C
|

Updated on: Jun 09, 2023 | 3:57 PM

Share

బాలాసోర్: ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో 288 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వీరి మృత దేహాలను ఉంచిన స్థానిక పాఠాలను కూల్చివేస్తున్నట్లు బాలాసోర్ జిల్లా కలెక్టర్ దత్తాత్రయ భౌసాహెబ్ షిండే గురువారం మీడియాకు తెలిపారు. రైలు ప్రమాదం జరిగిన తర్వాత సమీపంలో ఉన్న బాహాగానా ప్రభుత్వ పాఠశాలలో జిల్లా యంత్రాంగం క్యాంపు ఏర్పాటు చేసింది. ప్రమాదంలో మృతి చెందిన వారి బాడీలను అక్కడికి తరలించారు. ఈ క్రమంలో పాఠశాలలోని ప్రేయర్‌ రూంతోపాటు, కొన్ని తరగతి గదుల్లో మృతదేహాలను ఉంచారు. అనంతరం ఆ మృతదేహాలను మార్చురీకి తరలించారు.

ఐతే ఇది జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే మృతదేహాలు ఉంచిన పాఠశాలకు రావడానికి విద్యార్ధులు బయపడుతున్నట్లు వారి తల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చనిపోయిన వారి మృతదేహాలను ఉంచిన హైస్కూలును కూల్చివేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు అయన తెలిపారు. ఐతే స్కూలు మేనేజింగ్ కమిటీ ఆమోదిస్తే.. శవాలను ఉంచిన గదులను కూల్చివేసి కొత్తవి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై పాఠశాల కమిటీ వెంటనే సమావేశమై కూల్చివేతకు ఆమోదం తెల్పడంతో శుక్రవారం కూల్చివేత పనులు ప్రారంభించినట్లు కలెక్టర్‌ తెలిపారు. కొత్త భవనాలు నిర్మించిన తర్వాత పూజాది కార్యక్రమాలు నిర్వహించి స్కూల్‌ పునఃప్రారంభిస్తామని ఆయన అన్నారు. మరోవైపు ఒరిస్సా రాష్ట్ర వ్యాప్తంగా వేసవి సెలవులు జూన్‌ 19వ తేదీతో ముగియనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
టీమిండియాలో వాడు మా జట్టులో ఉంటే బాగుండేది..
టీమిండియాలో వాడు మా జట్టులో ఉంటే బాగుండేది..
డిబ్రుగఢ్‌లో ప్రారంభమైన న్యూస్9 ఇండియన్ టైగర్స్ ఫుట్‌బాల్ ట్రయల్స
డిబ్రుగఢ్‌లో ప్రారంభమైన న్యూస్9 ఇండియన్ టైగర్స్ ఫుట్‌బాల్ ట్రయల్స
జెండా పడిన వైపే పాడిపంటలు.. అడవి బిడ్డల హోలీ సంబరాలు ప్రత్యేకం..
జెండా పడిన వైపే పాడిపంటలు.. అడవి బిడ్డల హోలీ సంబరాలు ప్రత్యేకం..
36 సినిమాలు తీస్తే 26 ప్లాప్.. అయినా ఇండస్ట్రీకే తోపు డైరెక్టర్..
36 సినిమాలు తీస్తే 26 ప్లాప్.. అయినా ఇండస్ట్రీకే తోపు డైరెక్టర్..
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్..!
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్..!
ఆ మెగా హీరో కోసం రెమ్యునరేషన్ లేకుండా సినిమా చేసిన మహేష్ బాబు..
ఆ మెగా హీరో కోసం రెమ్యునరేషన్ లేకుండా సినిమా చేసిన మహేష్ బాబు..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్
హోలీ వేళ దారుణం..రంగులు పూసేందుకు వచ్చిన మనవడిపై అమ్మమ్మ కిరాతకం
హోలీ వేళ దారుణం..రంగులు పూసేందుకు వచ్చిన మనవడిపై అమ్మమ్మ కిరాతకం
వాట్సాప్ చాట్‌ ఆధారంగా విడాకులా ?? ఒరే.. మాంచి కథ కదురా ఇది
వాట్సాప్ చాట్‌ ఆధారంగా విడాకులా ?? ఒరే.. మాంచి కథ కదురా ఇది
ఈ పండు వీరికి చాలా డేంజర్ బాబోయ్.. బయటపడ్డ నమ్మలేని నిజాలు
ఈ పండు వీరికి చాలా డేంజర్ బాబోయ్.. బయటపడ్డ నమ్మలేని నిజాలు