PMVY: కేంద్రం గుడ్‌న్యూస్! ఇకపై రెండో కాన్పులో అమ్మాయి పుడితే రూ.6000 అందజేత.. పూర్తి వివరాలివే
ఆడ పిల్లల జననాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ‘మిషన్ శక్తి’ కింద 'ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంవీవై)' రూపొందించింది. ఈ పథకం కింద రెండోసారి గర్భం దాల్చినప్పుడు ఆడపిల్ల పుడితే..
ఆడ పిల్లల జననాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ‘మిషన్ శక్తి’ కింద ‘ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంవీవై)’ రూపొందించింది. ఈ పథకం కింద రెండోసారి గర్భం దాల్చినప్పుడు ఆడపిల్ల పుడితే.. వారికి రూ.6000 ఆర్థిక సాయంగా అందుతుంది. 2022 ఏప్రిల్ నుంచే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు కేంద్రం ప్రకటించింద. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంవీవై) కింద తొలి కాన్పులో ఆడ లేదా మగ బిడ్డ పుట్టినప్పటికీ మూడు దశల్లో గర్భం దాల్చినట్లు ఆన్‌లైన్‌లో నమోదుకాగానే రూ.1000, ఆరు నెలల తర్వాత రూ.2000, ప్రసవం జరిగిన 14 వారాల్లో రూ.2000 చొప్పున.. ఇలా మూడు విడతల్లో ఇప్పటి వరకు ఆర్థిక లబ్ధి అందజేస్తుంది. ఇకపై గర్భం దాల్చినప్పుడు రూ.3,000, ప్రసవం జరిగిన 14 వారాలకు రూ.2,000 చొప్పున రెండు విడతల్లోనే ఇవ్వాలని నిర్ణయం తీసకుంది. ఐతే రెండో కాన్పుకు ఈ పథకం వర్తించదు.
దీంతో ఇదే పథకానికి సవరణ చేస్తూ రెండో కాన్పులో అమ్మాయి పుడితే రూ.6000 అందజేయనున్నట్లు మార్పుచేశారు. అలాగే రెండో కాన్పులో కవలలు జన్మించి, వారిలో ఒకరు అమ్మాయి ఉన్నా ఈ పథకం వర్తిస్తుంది. జనన ధ్రువీకరణ పత్రం ఆధారంగా ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. ఆడపిల్లల జననాలను ప్రోత్సహించేందుకే దీన్ని చేర్చినట్లు కేంద్రం చెబుతోంది. ఈ మార్పులకు తగ్గట్లు కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌లో మార్పులు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ కథనాల కోసం క్లిక్ చేయండి.