‘త్రీ ఇడియట్స్‌’ మువీ సీన్ రిపీట్.. వీడియో కాల్ చూస్తూ గర్భిణికి నర్స్ ఆపరేషన్‌! ఆ తర్వాత ఏం జరిగిందంటే..

త్రీ ఇడియట్స్‌ సినిమా సీన్‌ను ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి రిపీట్‌ చేసింది. వీడియో కాల్‌ చూస్తూ నర్స్ ఓ మహిళకు ప్రసవం చేసేందుకు యత్నించింది. సిజేరియన్‌ చేయవల్సి రావడంతో అందుకూ వెనుకాడలేదు. దీంతో గర్భిణీ మృతి చెందింది. ఈ దారుణ..

'త్రీ ఇడియట్స్‌' మువీ సీన్ రిపీట్.. వీడియో కాల్ చూస్తూ గర్భిణికి నర్స్ ఆపరేషన్‌! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Pregnant Woman Died
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 08, 2023 | 12:05 PM

బిహార్: త్రీ ఇడియట్స్‌ సినిమా సీన్‌ను ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి రిపీట్‌ చేసింది. వీడియో కాల్‌ చూస్తూ నర్స్ ఓ మహిళకు ప్రసవం చేసేందుకు యత్నించింది. సిజేరియన్‌ చేయవల్సి రావడంతో అందుకూ వెనుకాడలేదు. దీంతో గర్భిణీ మృతి చెందింది. ఈ దారుణ ఘటన బిహార్‌లో జూన్‌ 5న జరిగింది. వివరాల్లోకెళ్తే..

బిహార్‌లోని పూర్నియా ప్రాంతానికి చెందిన మాల్తీ దేవీ (22)కు గత సోమవారం అర్ధరాత్రి పురిటి నొప్పులు రావడంతో స్థానికంగా ఉన్న సమర్పన్ మెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు బంధువులు. డాక్టర్ లేకపోకపోయినప్పటికీ ఆసుపత్రిలో మహిళలకు అడ్మిషన్‌ ఇచ్చి, చికిత్సనందించారు. మాల్తీకి నొప్పులు ఎక్కువవగా రావడంతో పరిస్థితి విషమించింది. దీంతో ఐసీయూలోకి తీసుకెళ్లారు. గైనకాలజిస్ట్ డాక్టర్ సీమా కుమారి వీడియో కాల్‌ ద్వారా సలహాలు ఇస్తుండగా, నర్స్‌ గర్భిణీకి ఆపరేషన్ చేసింది. మల్తీకి కవలలు జన్మించారు. ఆపరేషన్‌ చేసే క్రమంలో నర్స్‌ ఓ ముఖ్యమైన నరాన్ని కత్తిరించింది. దీంతో పుట్టిన కవలలు క్షేమంగానే ఉన్నప్పటికీ.. ఆపరేషన్ ఆనంతరం బాధితురాలు మృతి చెందింది.

మల్తీ కుటుంబ సభ్యులు మంగళవారం ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. నిర్లక్ష్యంగా ఆపరేషన్‌ నిర్వహించిన ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆసుపత్రి వద్దకు చేరుకున్న ఎస్‌హెచ్‌ఓ రంజిత్‌ కుమార్‌ మృతురాలి బంధువులకు సర్దిచెప్పి ఇంటికి పంపారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..