మెడలో దిగిన కత్తితో బైక్ డ్రైవింగ్‌ చేసుకుంటూ ఆసుపత్రికి.. 4 గంటల ఆపరేషన్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

అన్నదమ్ములు గొడవపడ్డారు. అన్న నిద్రిస్తున్న సమయంలో.. తమ్ముడు కత్తితో అన్న గొంతులో పొడిచాడు. దీంతో కత్తి గొంతులోనే ఇరుక్కుపోయింది. రక్తం కారుతున్నా లెక్క చేయకుండా అన్న బైక్‌పై స్వంతంగా డ్రైవ్‌ చేసుకుంటూ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. ఈ షాకంగ్‌ ఘటన..

మెడలో దిగిన కత్తితో బైక్ డ్రైవింగ్‌ చేసుకుంటూ ఆసుపత్రికి.. 4 గంటల ఆపరేషన్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
Knife Stabbed In Man's Neck
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 07, 2023 | 1:07 PM

ముంబై: అన్నదమ్ములు గొడవపడ్డారు. అన్న నిద్రిస్తున్న సమయంలో.. తమ్ముడు కత్తితో అన్న గొంతులో పొడిచాడు. దీంతో కత్తి గొంతులోనే ఇరుక్కుపోయింది. రక్తం కారుతున్నా లెక్క చేయకుండా అన్న బైక్‌పై స్వంతంగా డ్రైవ్‌ చేసుకుంటూ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. ఈ షాకంగ్‌ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ముంబయిలోని సాన్‌పాడా సెక్టార్‌ 5లో నివసించే తేజస్‌ పాటిల్‌ (30) అనే వ్యాపారవేత్తకు, అతని సోదరుడు మోనీశ్‌ (28)కి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. జూన్ 3వ తేదీన రాత్రి తేజస్ తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో సోదరుడు మోనీశ్‌, మరో వ్యక్తితో వచ్చి తేజస్‌పై కత్తితో దాడి చేశాడు. ఆ దాడిలో కత్తి తేజస్ మెడలో దిగిపోయింది. తమ్ముడి దాడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న తేజస్ బాధతో పెద్దగా అరవడం ప్రారంభించాడు. దీంతో తమ్ముడు మోనీశ్‌, అతనితోపాటు వచ్చిన మరో వ్యక్తి పారిపోయారు. ఆ తర్వాత తేజస్‌ తన బైక్‌పై స్వయంగా డ్రైవ్‌ చేసుకుంటూ సమీపంలోని ఎంపీసీటీ ఆసుపత్రికి చేరుకున్నాడు. మెడలో కత్తితో వచ్చిన తేజస్‌ని చూసి ఆసుపత్రి సిబ్బంది షాక్‌కు గురయ్యారు. వైద్యులు నాలుగు గంటలపాటు శ్రమపడి శస్త్ర చికిత్స చేసి అతని గొంతులోని కత్తిని తొలగించి, వైద్యం అందిచారు.

ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. మెడపై కత్తిదాడి జరిగినా, రక్తనాళాలు దెబ్బతినకపోవటంత తేజస్‌కు ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు. మరో రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్‌ చేస్తామన్నారు. ఇక తేజస్ తనపై జరిగిన దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మద్యానికి బానిసైన తన సోదరుడు, మహేశ్ అనే స్నేహితుడితో కలిసి వచ్చి తనపై దాడి చేసినట్లు పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.