AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట.. తలలో ఇనుప నట్టు ఉంచి కుట్లు.. ఎంతకూ రక్తస్రావం ఆగకపోవడంతో చివరికి..

తలకు గాయమై ఓ వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. డాక్టర్లు వైద్యం చేసి కట్టుకట్టి ఇంటికి పంపారు. ఐతే గాయం నుంచి ఎంతకూ రక్తస్రావం ఆగకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అతన్ని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు స్కాన్‌ చేయగా.

ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట.. తలలో ఇనుప నట్టు ఉంచి కుట్లు.. ఎంతకూ రక్తస్రావం ఆగకపోవడంతో చివరికి..
Iron Bolt Inside Patient's Head
Srilakshmi C
|

Updated on: Jun 07, 2023 | 2:20 PM

Share

తమిళనాడు: తలకు గాయమై ఓ వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. డాక్టర్లు వైద్యం చేసి కట్టుకట్టి ఇంటికి పంపారు. ఐతే గాయం నుంచి ఎంతకూ రక్తస్రావం ఆగకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అతన్ని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు స్కాన్‌ చేయగా అసలు విషయం బయటపడింది. తలపై కుట్లు వేసిన ప్రదేశంలో ఇనుప నట్టు ఉండటం చూసి వైద్యులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. అసలేం జరిగిందంటే..

తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా వానియాంబాడీ ప్రాంతంలోని ఉదయేంద్రం గ్రామానికి చెందిన కార్తికేయన్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో కార్తికేయన్ నడుపుతున్న​లారీని, వెనుక నుంచి ఓ ప్రైవేట్ బస్సు ఢీ కొట్టింది. దీంతో లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కార్తికేయన్ తలకు బలమైన గాయమైంది. స్థానికులు అతన్ని రక్షించి, వేలూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు బాధితుడికి చికిత్స చేసి, తలకు కుట్లు వేశారు. అయినా రక్తస్రావం ఆగకపోవడంతో అతని కుటుంబ సభ్యులు కార్తికేయన్‌ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

అక్కడ వైద్యులు బాధితుడి తలకు కుట్లు వేసిన ప్రదేశంలో ఇనుప నట్టు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆపరేషన్‌ నిర్వహించి నట్టును తొలగించారు. గాయమైన ప్రదేశంలో ఇన్‌ఫెక్షన్​కావడంతో.. రెండు రోజుల తర్వాత మళ్లీ కుట్లు వేస్తామని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంపై బాధితుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వేలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రి డీన్​ డాక్టర్​పాపాపతిని వివరణ కోరగా, ఇప్పటివరకు తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

సమీరారెడ్డి దగ్గర ఉన్న స్పెషల్ బ్లౌజ్ ధర ఎంతో తెలుసా?
సమీరారెడ్డి దగ్గర ఉన్న స్పెషల్ బ్లౌజ్ ధర ఎంతో తెలుసా?
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్
శివ భక్తులకు రైల్వేశాఖ మరో శుభవార్త
శివ భక్తులకు రైల్వేశాఖ మరో శుభవార్త
విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం
విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం
నేనే రాజు.. నేనే మంత్రి.! మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే..
నేనే రాజు.. నేనే మంత్రి.! మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే..
పెంపుడు పిల్లుల నుంచి పాఠాలు నేర్చుకున్నానంటున్న స్టార్ హీరోయిన్‌
పెంపుడు పిల్లుల నుంచి పాఠాలు నేర్చుకున్నానంటున్న స్టార్ హీరోయిన్‌
పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్..
పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్..
కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!
కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!
పులి ఎముకలకు అన్ని కోట్లా.? మీరు అస్సలు ఊహించలేరు..
పులి ఎముకలకు అన్ని కోట్లా.? మీరు అస్సలు ఊహించలేరు..
తక్కువ ధరకే బ్రాండెడ్ వస్తువులు కొనే సీక్రెట్ ఇదే..
తక్కువ ధరకే బ్రాండెడ్ వస్తువులు కొనే సీక్రెట్ ఇదే..