Big News Big Debate : ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. 'ధరణి' దుమారం..(లైవ్)

Big News Big Debate : ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ‘ధరణి’ దుమారం..(లైవ్)

Anil kumar poka

|

Updated on: Jun 08, 2023 | 7:03 PM

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ధరణి దుమారం బలంగా వీస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో దీనినే ప్రధాన అస్త్రంగా మలుచుకుంటున్నాయి ప్రధానపార్టీలు. అతిపెద్ద భూసంస్కరణ అంటున్న కేసీఆర్‌ దీనిని తన మానసపుత్రికగా చెబుతుంటే.. దేశంలోనే అతిపెద్ద భూదోపిడీకి కేరాఫ్‌ అంటున్నాయి విపక్షాలు.

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ధరణి దుమారం బలంగా వీస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో దీనినే ప్రధాన అస్త్రంగా మలుచుకుంటున్నాయి ప్రధానపార్టీలు. అతిపెద్ద భూసంస్కరణ అంటున్న కేసీఆర్‌ దీనిని తన మానసపుత్రికగా చెబుతుంటే.. దేశంలోనే అతిపెద్ద భూదోపిడీకి కేరాఫ్‌ అంటున్నాయి విపక్షాలు. అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామంటోంది కాంగ్రెస్ పార్టీ. అదే జరిగితే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గల్లంతే అంటోంది అధికార BRS. అసలు ధరణిలో ఎన్ని పెండింగ్‌ ధరఖాస్తులున్నాయో స్టేటస్‌ రిపోర్ట్‌ బయటపెట్టాలంటోంది BJP. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న వేళ.. ధరణి పోర్టల్ వ్యవహారం అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలకు ఇదే రాజకీయాస్త్రమైంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ పేదలకు శాపంగా మారిందని.. అధికారంలోకి వచ్చిన వెంటనే బంగాళాఖాతంలో కలుపుతామంటూ కాంగ్రెస్‌లోని టాప్‌ టు బాటమ్‌ నేతలు ప్రచారం చేస్తున్నారు. ధరణి వల్ల భూస్వాములు బాగుపడితే.. పేద రైతులు మరింత కష్టాల పాలయ్యారంటోంది హస్తం పార్టీ. అంతకుముందు కూడా ధరణి పోర్టలే పెద్ద స్కామ్‌ అని.. సమగ్ర దర్యాప్తు జరిపించాలని కూడా పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అటు బీజేపీ కూడా ధరణి పోర్టల్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.