AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrigasira Karthi 2023: మృగశిర కార్తె ఎఫెక్ట్.. కిటకిటలాడుతోన్న చేపల మార్కెట్లు..! ధర ఎంతున్న కొనేందుకు ఎగబడుతోన్న జనాలు

ఏటా మృగశిర కార్తె నాడు తప్పనిసరిగా చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. బుధ, గురువారాల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చేపల మార్కెట్లన్నీ కక్కిరిసిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేపల మార్కెట్లలో రద్దీ నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ ముషీరాబాద్‌లోని దయారా చేపల..

Mrigasira Karthi 2023: మృగశిర కార్తె ఎఫెక్ట్.. కిటకిటలాడుతోన్న చేపల మార్కెట్లు..! ధర ఎంతున్న కొనేందుకు ఎగబడుతోన్న జనాలు
Huge Rush At Fish Market
Srilakshmi C
|

Updated on: Jun 08, 2023 | 1:35 PM

Share

హైదరాబాద్: ఏటా మృగశిర కార్తె నాడు తప్పనిసరిగా చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో  బుధ, గురువారాల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చేపల మార్కెట్లన్నీ కిక్కిరిసిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేపల మార్కెట్లలో రద్దీ నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ ముషీరాబాద్‌లోని దయారా చేపల మార్కెట్‌లో నిన్నటి నుంచి సందడి నెలకొంది. మార్కెట్‌కు వందల కొద్ది లారీల్లో చేపలు వచ్చాయి. ఈసారి మృగశిర కార్తె ఎఫెక్ట్ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను కూడా తాకింది.​ఏపీలోని విజయవాడ, కృష్ణ, గుంటూరు, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేల టన్నుల చేపలు హైదరాబాద్‌కు చేరుకున్నాయి.

రవ్వ, బొచ్చ, కొర్రమీను, టంటం, పాంప్లెట్, బంగారు తీగ వంటి పలు రకాల చేపలు, రొయ్యలు, పీతలు దిగుమతి అయ్యాయి. దీంతో మార్కెట్లన్నీ వ్యాపారులు, జనాలతో కిటకిటలాడాయి. చేపల ధరలు కూడా గత ఎడాదికన్నా మరింత పెరిగాయి. సాధారణంగా రవ్వ, బొచ్చ రూ.70 నుంచి 90కు కేజీ అమ్ముడవుతూ ఉంటాయి. మృగశిర కార్తె సందర్భంగా వీటి ధర ఏకంగా రూ.120 నుంచి 200 వరకు పలుకుతున్నాయి. హైబ్రిడ్ కొర్రమీను కేజీ రూ.300 నుంచి 400కు చేరుకుంది. నాటు కొరమీను రూ.500 నుంచి 800 వరకు అమ్ముతున్నారు.

కాగా ముషీరాబాద్ చేపల మార్కెట్ నుంచి నగరంలోని పలు ప్రాంతాల చిన్నాచితక వ్యాపారులు పెద్ద ఎత్తున అన్ని రకాల చేపలు కొనుగోలు చేస్తున్నారు. వాటిని ఇతర ప్రాంతాలకు తరలించి డిమాండ్‌ను బట్టి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ గ్రామాలకు చెందిన మత్స్యకారులు చేపల చెరువుల నుంచి చేపలను విక్రయించడానికి తీసుకువస్తున్నారు. వాటిని కొనుగోలు చేసేందుకు వచ్చిన స్థానికులు ధర ఎంత ఉన్నా వెనకాడకుండా కొనుగోలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.