AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రముఖ దూరదర్శన్ యాంకర్‌ గీతాంజలి అయ్యర్ కన్నుమూత..! ప్రముఖుల సంతాపం

ప్రముఖ దూరదర్శన్ యాంకర్ గీతాంజలి అయ్యర్ (70) కన్నుమూశారు. నేషనల్ బ్రాడ్‌కాస్టర్ దూరదర్శన్‌లో తొలితరం మహిళా ఇంగ్లిష్‌ న్యూస్‌ యాంకర్లలో ఒకరుగా ఆమె ప్రసిద్ధి. గతకొంతకాలంగా పార్కిన్సన్స్‌ వ్యాధితో గీతాంజలి బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించి..

ప్రముఖ దూరదర్శన్ యాంకర్‌ గీతాంజలి అయ్యర్ కన్నుమూత..! ప్రముఖుల సంతాపం
Gitanjali Aiyar
Srilakshmi C
|

Updated on: Jun 08, 2023 | 10:08 AM

Share

న్యూఢిల్లీ: ప్రముఖ దూరదర్శన్ యాంకర్ గీతాంజలి అయ్యర్ (70) కన్నుమూశారు. నేషనల్ బ్రాడ్‌కాస్టర్ దూరదర్శన్‌లో తొలితరం మహిళా ఇంగ్లిష్‌ న్యూస్‌ యాంకర్లలో ఒకరుగా ఆమె ప్రసిద్ధి. గతకొంతకాలంగా పార్కిన్సన్స్‌ వ్యాధితో గీతాంజలి బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించి ఆమె బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. దూరదర్శన్‌కు ఆమె చేసిన సేవలను కొనియాడారు. గీతాంజలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా అవార్డు విన్నింగ్ యాంకర్ అయిన గీతాంజలి దూరదర్శన్ ‌, ఆల్‌ ఇండియా రేడియోలో మొదటి ఇంగ్లిష్ న్యూస్‌ యాంకర్‌గా పనిచేశారు.

కోల్‌కతాలోని లొరెటో కాలేజీలో గీతాంజలి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. ఆ తర్వాత 1971లో దూరదర్శన్‌లో చేరారు. నాలుగు సార్లు ఉత్తమ యాంకర్‌గా అవార్డు. మీడియా రంగంలో ఆమె అందించిన అత్యుత్తమ సేవలకు గానూ 1989లో ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డును కూడా గెలుపొందారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) నుండి డిప్లొమా హోల్డర్ అయిన అయ్యర్ అనేక వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించారు. వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ (WWF)లోనూ పనిచేశారు. 30 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించిన గీతాంజలి మృతి పట్ల పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దూరదర్శన్‌లో కెరీర్‌ ముగిశాక, కార్పొరేట్‌ రంగం వైపు అడుగులు వేశారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీలో పని చేశారు. ఖాందాన్‌ అనే సీరియల్‌లోనూ నటించారు. గీతాంజలి అయ్యర్‌కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు