Telangana: పార్ట్ టైం ఉద్యోగం ఆఫర్లు ఇస్తామంటున్నారా.. వాటిని నమ్మారంటే మీ జేబులకు చిల్లే
ఈ మధ్య సైబర్ నేరాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఉపాధి కల్పిస్తామంటూ, పెట్టుబడులు పెడితే అధిక డబ్బులు వస్తాయంటు నమ్మిస్తున్న సైబర్ కేటుగాళ్లు ఎంతోమంది నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ఇప్పడు తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
ఈ మధ్య సైబర్ నేరాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఉపాధి కల్పిస్తామంటూ, పెట్టుబడులు పెడితే అధిక డబ్బులు వస్తాయంటు నమ్మిస్తున్న సైబర్ కేటుగాళ్లు ఎంతోమంది నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ఇప్పడు తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పార్ట్‌టైం జాబ్ ఇస్తామని చెప్పి ఇద్దరి నుంచి రూ.50 లక్షలు కాజేసిన ఉదంతం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా పార్ట్ జాబ్స్ కోసం ఆన్‌లైన్‌లో వెతికారు. ఈ క్రమంలో వారికి టెలిగ్రామ్ ద్వారా ఇద్దరు సైబర్ నేరగాళ్లు పరిచయమయ్యారు. రెజ్యూమ్‌లు పంపించండని ఉపాధి అవకాశం కల్పిస్తామని చెప్పారు.
ఇది నమ్మిన వాళ్లిద్దరు తమ రెజ్యూమ్‌లను పంపించారు. అయితే ఉద్యోగం వచ్చేవరకు వేచి చూడకుండా పెట్టుబడులు పెట్టాలని కోరారు. మాయమాటలు చెప్పి వాళ్లు ఇన్వెస్ట్‍మెంట్ చేసేలా చేశారు. మొదట కొన్ని రోజులు లాభాలు ఇచ్చి నమ్మకాన్ని కలిగేలా చేశారు. ఆ తర్వాత ఒకరి నుంచి రూ.30లక్షలు, మరొక వ్యక్తి నుంచి రూ.20లక్షలు చొప్పున భారీగా నగదు కాజేశారు. మరిన్ని లక్షలు పెట్టుబడి పెట్టాలంటూ ఒత్తిడి చేశారు. దీంతో బాధితులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..