Hyderabad: ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థిని ఆత్మహత్య..! క్షుద్రపూజల వల్లనే అంటోన్న తల్లిదండ్రులు

ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ చదువుతోన్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. బాలిక ఆత్మహత్య వెనుక అసలు కారణం తెలియనప్పటికీ.. తల్లిదండ్రులు మాత్రం గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో తమ కూతురిపై క్షుద్రపూజలు చేయడం వల్లనే..

Hyderabad: ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థిని ఆత్మహత్య..! క్షుద్రపూజల వల్లనే అంటోన్న తల్లిదండ్రులు
Black Magic
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 08, 2023 | 10:35 AM

హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ చదువుతోన్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. బాలిక ఆత్మహత్య వెనుక అసలు కారణం తెలియనప్పటికీ.. తల్లిదండ్రులు మాత్రం గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో తమ కూతురిపై క్షుద్రపూజలు చేయడం వల్లనే మరణించిందని చెబుతున్నారు. ఈ విషాద ఘటన భరత్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

హైదరాబాద్‌లోని కుల్సుంపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని భరత్‌నగర్‌కు చెందిన నవ్య అనే విద్యార్థిని స్థానిక జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్ రెండో ఏడాది చదువుతోంది. ఐతే కారణం ఏమైఉంటుందో తెలియదుగానీ బుధవారం (జూన్‌ 7) రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని బలన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై తల్లీదండ్రులకు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. కూతురు నవ్య మృతిపై తల్లిదండ్రుల ఆరోపణలు వేరేలా ఉన్నాయి. తమ ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారని తెలిపారు. రోజూ రాత్రి వేళ నిమ్మకాయలు, దీపాలు పెట్టి వెళ్తున్నారని అన్నారు. ఎవరో చేతబడి లాంటి క్షుద్రపూజలు చేశారని, అందుకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని నవ్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా క్షుద్ర పూజల వల్లనే నవ్య ఆత్మహత్య చేసుకుందా లేక మరేదైనా కారణం వల్ల మృతి చెందిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.