Hyderabad: మరో అద్భుత నిర్మాణానికి వేదిక కానున్న హైదరాబాద్.. దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి బిల్డింగ్. ఎక్కడంటే..
Hyderabad News: హైదరాబాద్ మహా నగరం మరో అద్భుత నిర్మాణానికి వేదికకానుంది. ఇప్పటికే కొత్త సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, టీ హబ్ వంటి ఎన్నో నిర్మాణాలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం మరో అద్భుత నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ నిర్మాణం దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి భవంతిగా..
హైదరాబాద్ మహా నగరం మరో అద్భుత నిర్మాణానికి వేదికకానుంది. ఇప్పటికే కొత్త సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, టీ హబ్ వంటి ఎన్నో నిర్మాణాలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం మరో అద్భుత నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ నిర్మాణం దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి భవంతిగా పేరు గాంచనుంది. తెలంగాణ ప్రభుత్వం నిమ్స్‌కు అనుబంధంగా అధునాతన ఆసుపత్రిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎర్రమంజిల్‌లోని ప్రభుత్వ ప్రాంగణంలో 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం అవుతోంది.
పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా నిమ్స్‌ను భారీగా విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. నిమ్స్‌కు సమీపంలో ఉన్న ప్రభుత్వ క్వార్టర్ల స్థానంలో నిర్మించనున్నారు. ఈనెల 14వ తేదీన భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. త్వరలోనే టెండర్లకు ఆహ్వానం లపికి, త్వరతగతిన నిర్మాణం పూర్తయ్యేలా పనులు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.
ఇక ఈ నూతన భవనంలో మొత్తం 34 డిపార్ట్‌మెంట్‌లు ఉండనున్నాయి. 2100 పడకల ఆసుపత్రిగా కొత్త నిమ్స్‌ను నిర్మించనున్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి రూ.1,570 కోట్లు ఖర్చు చేయనున్నారు. 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకే భవనం దేశంలో మరెక్కడ లేకపోవడం విశేషం. అయితే వేర్వేరు భవనాలతో భారీ విస్తీర్ణంతో ఆసుపత్రులు దేశవ్యాప్తంగా పలు ఉన్నాయి.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..