ఐశ్వర్యరాయ్‌ పాటలో ఈ బ్యాక్‌ గ్రౌండ్ డ్యాన్సర్‌ని గుర్తుపట్టారా? ఇప్పుడు అతనో స్టార్ హీరో..

సినిమా రంగం ఓ రంగుల ప్రపంచం. అక్కడ స్టార్ హోదా దక్కించుకోవడం ప్రతి ఒక్కరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఎందరో ఈ రంగస్థలం మీద తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తుంటారు. ఐతే వారిలో చాల కొద్దిమంది మాత్రమే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. కష్టంతోపాటు ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలని ఎక్కువమంది నమ్మకం..

ఐశ్వర్యరాయ్‌ పాటలో ఈ బ్యాక్‌ గ్రౌండ్ డ్యాన్సర్‌ని గుర్తుపట్టారా? ఇప్పుడు అతనో స్టార్ హీరో..
Shahid Kapoor As Background Dancer
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 08, 2023 | 2:46 PM

సినిమా రంగం ఓ రంగుల ప్రపంచం. అక్కడ స్టార్ హోదా దక్కించుకోవడం ప్రతి ఒక్కరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఎందరో ఈ రంగస్థలం మీద తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తుంటారు. ఐతే వారిలో చాల కొద్దిమంది మాత్రమే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. కష్టంతోపాటు ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలని ఎక్కువమంది నమ్మకం. ఈ తరహాలోనే ఓ ప్రముఖ హీరో స్టార్ గా ఎదగకముందు తాను పడ్డ ఇబ్బందుల గురించి తాజాగా వెల్లడించాడు.

బాలీవుడ్‌ స్టార్ హీరో షాహిద్ కపూర్ గురించి తెలియని వారుండరు. హిందీ చిత్ర పరిశ్రమలో షాహిద్‌ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. 2003లో విడుదలైన షాహిద్ కపూర్ నటించిన ఫస్ట్‌ మువీ ‘ఇష్క్ విష్క్’తో సినిమా రంగంలో అడుగుపెట్టారు. ఐతే ఈ మువీ కంటే ముందు నుంచి కూడా షాహిద్ సినిమాల్లో కొనసాగాడనే విషయం చాలా మందికి తెలియదు. అప్పటి సినిమాలో బ్యాక్‌ గ్రౌండ్‌ డ్యాన్సర్‌గా పనిచేసేవాడు. ఐశ్వర్యరాయ్ నటించిన ‘తాల్‌’ సినిమాలో ‘కహీన్ ఆగ్ లగే లాగ్ జాయే’ అనే సాంగ్‌ బ్యాక్ గ్రౌండ్‌లో షాహిద్ డ్యాన్స్ చేశాడు. ఈ విషయాన్ని షాహిద్‌ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కెరీర్‌ ప్రారంభంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తన అనుభవాలను పంచుకున్నాడు. షూటింగ్ సెట్‌కి వెళుతుండగా ఓ సారి ప్రమాదానికి గురయ్యానని, ఆ సమయంలో చాలా ఉద్వేగానికి లోనయ్యానని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

‘ఈ విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. అప్పట్లో ఎక్కడికి వెళ్లాలన్నా మోటర్ సైకిల్ తొక్కుతూ వెల్లేవాడ్ని. అలా వెళ్తున్న క్రమంలో ఓ సారి యాక్సిడెంట్‌ జరిగింది. మోటర్‌ సైకిల్‌పై నుంచి కిందపడిపోయాను. ఆ తర్వాత భయంభయంగా సెట్‌కి చేరుకున్నాను. ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. అది నా జీవితంలో బెస్ట్ అండ్ వరస్ట్ డే’ అని నాటి విషయాలను షాహిద్ జ్ఞాపకం చేసుకున్నాడు. తాల్ కంటే ముందు, ‘దిల్ తో పాగల్ హై’ మువీలో కూడా బ్యాక్ గ్రౌండ్‌లో షాహిద్ పనిచేశాడు. కెరీర్‌ తొలినాళ్లలో సినిమాల్లో చాలా చిన్న పాత్రలు చేశానని తెలిపాడు. ఆలా చేస్తున్న క్రమంలో ఓ మువీలోని కీలక సన్నివేశంలో తన ముఖం చూపించే అవకాశం వచ్చిందన్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.