Nirmala Sitharaman: నిడారంబరంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కుమార్తె పెళ్లి.. రాజకీయ ప్రముఖులకు అందని ఆహ్వానం

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కుమార్తె పెళ్లి నిరాడంబరంగా జరిగింది. అతికొద్దిమంది అతిథుల సమక్షంలో నిర్మలమ్మ కుమార్తె పరకాల వాజ్ఞ్మయి , ప్రతీక్‌ దోషిల వివాహ వేడుక గురువారం (జూన్‌ 8)న జరిగింది. బెంగళూరులోని నిర్మలమ్మ నివాసంలో..

Nirmala Sitharaman: నిడారంబరంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కుమార్తె పెళ్లి.. రాజకీయ ప్రముఖులకు అందని ఆహ్వానం
Nirmala Sitharaman Daughter Marriage
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 09, 2023 | 10:56 AM

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కుమార్తె పెళ్లి నిరాడంబరంగా జరిగింది. అతికొద్దిమంది అతిథుల సమక్షంలో నిర్మలమ్మ కుమార్తె పరకాల వాజ్ఞ్మయి , ప్రతీక్‌ దోషిల వివాహ వేడుక గురువారం (జూన్‌ 8)న జరిగింది. బెంగళూరులోని నిర్మలమ్మ నివాసంలో బ్రాహ్మణ సంప్రదాయంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఉడిపిలోని అదమరు మఠ్‌కు చెందిన పురోహితులు వివాహ తంతు నిర్వహించారు.

ఇక వధువు వాజ్ఞ్మయి గులాబీ రంగు చీర, ఆకుపచ్చ రవిక అతికొద్ది నగలు ధరించింది. వరుడు ప్రతీక్‌ తెలుపు రంగు పంచె, కండువాలో కనిపించారు. ఐతే ఒక్క రాజకీయ నాయకుడుగానీ, వీఐపీలు గానీ ఎవ్వరూ పెళ్లింట కనిపించకపోవడం విశేషం. నిర్మలా సీతారామన్‌ ఇంట జరుగుతోన్న పెళ్లి గురించిన సమాచారం అధికారికంగా ప్రకటించకుండా అత్యంత గోప్యంగా ఉంచారు. దీంతో వీరి పెళ్లి సమయంలో తీసిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

సాధారణంగా రాజకీయ ప్రముఖుల ఇళ్లలో జరిగే పెళ్లిళ్లలో భారీ సెట్టింగులు, కళ్లు జిగేలనే పందిళ్లు, రాజకీయ ప్రముఖులు, బడా వ్యాపారవేత్తల రాకపోకలు, రకరకాల వంటకాలు.. అబ్బో ఒకటేమిటి అన్నీ వింతగానే ఉంటాయి. ఐతే నిర్మలమ్మ కుమార్తె వాజ్ఞ్మయి పెళ్లి మాత్రం అందుకు భిన్నంగా ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా అత్యంత సాధారణంగా జరిపించడం ప్రస్తుతం దేశమంతా చర్చించుకుటున్నారు.

మరిన్ని జాతీయ కథనాల కోసం క్లిక్‌ చేయండి.