ఒంట్లో మంచి కొలెస్ట్రాల్ పెంచే పల్లీలు.. తింటే ఎంతో మేలు!
06 March 2026
TV9 Telugu
TV9 Telugu
వేరుశనగలను సామాన్యుడి జీడిపప్పుగా వ్యవహరిస్తారు. తక్షణ శక్తినిచ్చే వీటిలో పోషకాలూ అధికమే. ఆరోగ్యంతోపాటు సౌందర్యపోషణలోనూ ప్రధాన పాత్ర వహిస్తాయి
TV9 Telugu
వీటిని పల్లీలని కూడా పిలుస్తారు. 100 గ్రాముల వేరుశనగల నుంచి దాదాపు 567 కెలొరీల శక్తి లభ్యమవుతుంది. పల్లీలను ఆరేడు గంటలు నానబెట్టి వాడుకుంటే తేలికగా జీర్ణమవుతాయి
TV9 Telugu
పచ్చి వేరుశనగ పప్పులను తింటే మరీ మంచిది. వీటిలో కొలెస్ట్రాల్ జీరో. గుండె జబ్బులు తగ్గిస్తాయి. కండరాలకు బలాన్ని చేకూరుస్తాయి
TV9 Telugu
ఎక్కువ మొత్తంలో మాంసకృత్తులు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి కండరాల ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. మంచి కొవ్వులూ అధికమే
TV9 Telugu
విటమిన్ ఇ, సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టుతోపాటు చర్మాన్నీ రక్షిస్తాయి. పల్లీల్లోని సమ్మేళనాలు ఆందోళన, ఒత్తిళ్లను తగ్గిస్తాయి
TV9 Telugu
రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. ఈ శక్తిమంతమైన గింజలను తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా మారతాయి
TV9 Telugu
వీటి నుంచి విటమిన్లు, మినరల్స్ మెండుగా లభిస్తాయి. వీటిలో ప్రొటీన్లు, పీచు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి
TV9 Telugu
ఆరోగ్యంగా ఉన్నవాళ్లూ వయసులో ఉన్నవాళ్లూ పల్లీలుగానీ పల్లీ బటర్‌గానీ తింటే, రక్తనాళాల పనితీరు మెరుగవుతుందని బార్సిలోనా యూనివర్సిటీకి చెందిన నిపుణులు చేసిన పరిశోధనలో స్పష్టమైందట