AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drone Pilot: డ్రోన్ పైలట్ కావాలని అనుకుంటున్నారా?  శిక్షణ కోర్స్‌ వివరాలు ఇవే..

ప్రస్తుతం డ్రోన్ వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. ఫోటోగ్రఫీ నుంచి వాతావరణ పరిశోధన వరకూ.. ట్రాన్స్ పోర్ట్ నుంచి వ్యవసాయ పనుల వరకూ డ్రోన్ వ్యవస్థతో పనులు నిర్వహించుకునే విధంగా పరిస్థితులు మారుతున్నాయి. తక్కువ ఖర్చు.. వేగంగా పని జరగడం వంటి.

Drone Pilot: డ్రోన్ పైలట్ కావాలని అనుకుంటున్నారా?  శిక్షణ కోర్స్‌ వివరాలు ఇవే..
Drone Pilot
Subhash Goud
|

Updated on: Jun 09, 2023 | 5:23 PM

Share

ప్రస్తుతం డ్రోన్ వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. ఫోటోగ్రఫీ నుంచి వాతావరణ పరిశోధన వరకూ.. ట్రాన్స్ పోర్ట్ నుంచి వ్యవసాయ పనుల వరకూ డ్రోన్ వ్యవస్థతో పనులు నిర్వహించుకునే విధంగా పరిస్థితులు మారుతున్నాయి. తక్కువ ఖర్చు.. వేగంగా పని జరగడం వంటి కారణాలతో డ్రోన్ వ్యవస్థ వైపు అన్నీ రంగాలూ ఆకర్షితులవుతున్నాయి. నేపథ్యంలో డ్రోన్ పైలట్లకు డిమాండ్ క్రమేపీ పెరుగుతోంది. డ్రోన్ ఆపరేట్ చేయాలంటే ప్రత్యేక శిక్షణ అవసరం. అందుకోసం యూరోపియన్ ఏవియేషన్ దిగ్గజం ఎయిర్ బస్ డ్రోన్ పైలట్ల కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఈ కంపెనీ ఇప్పుడు భారత్ లో డ్రోన్ పైలట్ల శిక్షణ కోర్స్ తీసుకువస్తోంది. ఇది ఐదురోజుల సర్టిఫికెట్ కోర్స్. దీని కోసం సంస్థ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఆమోదం పొందింది

సూక్ష్మ, చిన్న కేటగిరీ డ్రోన్ల కోసం ఉద్దేశించిన కోర్సులు బెంగళూరులోని ఎయిర్‌బస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో జూన్‌ 26 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. డ్రోన్ల నిబంధనలు, ఫ్లయిట్‌ ప్రాథమిక సూత్రాలు, నిర్వహణ మొదలైన వాటిపై డీజీసీఏ ఆమోదించిన ఇన్‌స్ట్రక్టర్లు శిక్షణనిస్తారని పేర్కొంది. సిమ్యులేటర్‌ శిక్షణతో పాటు ప్రాక్టికల్‌ ఫ్లయింగ్‌ పాఠాలు కూడా ఇందులో ఉంటాయని వివరించింది.

10వ తరగతి పూర్తి చేసిన, 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇందు కోసం దరఖాస్తు చేసుకునేవారికి తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్ ఉండాలి. అలాగే శిక్షణ పొందేందుకు, డ్రోన్‌లను ఆపరేట్ చేయడానికి ఫిట్‌నెస్‌ను ధ్రువీకరించే మెడికల్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి