Andhra Pradesh: ‘టెన్త్, ఇంటర్‌ ఫెయిలైన విద్యార్ధులూ తరగతులకు హాజరుకావచ్చు’.. విద్యాశాఖ మంత్రి బొత్స

పదో తరగతి, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్ధులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ ఏడాది పబ్లిక్‌ పరీక్షలు, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు మళ్లీ చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని..

Andhra Pradesh: 'టెన్త్, ఇంటర్‌ ఫెయిలైన విద్యార్ధులూ తరగతులకు హాజరుకావచ్చు'.. విద్యాశాఖ మంత్రి బొత్స
Minister Botsa Satyanarayana
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 09, 2023 | 4:30 PM

పదో తరగతి, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్ధులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ ఏడాది పబ్లిక్‌ పరీక్షలు, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు మళ్లీ చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యార్థులు పాఠశాల, కళాశాలలకు వెళ్లి చదువుకోవచ్చని, అయితే, అన్ని సబ్జెక్టులూ చదవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన విద్యార్ధులకు గతంలో కంపార్ట్‌మెంటల్‌ అని ఇస్తున్నారు. మళ్లీ బడికి వెళ్లి మొత్తం అన్ని సబ్జెక్టులు మళ్లీ చదివితే రెగ్యులర్‌గా ఉత్తీర్ణులైనట్లు పరిగణిస్తారని మంత్రి తెలిపారు. పాఠశాలల్లో అమలు చేయనున్న కార్యక్రమాల గురించి విజయవాడలో జూన్ 8న మీడియాతో ఆయన ఈ మేరకు మాట్లాడారు.

ఈ ఏడాది పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యాకానుక అందిస్తామని మంత్రి తెలిపారు. అమ్మఒడి లబ్ధిదారుల జాబితాను ఈనెల 12 నుంచి 22 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచుతామన్నారు. జూన్‌ 28న అమ్మఒడి పథకం డబ్బులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. విద్యార్థుల్లో ఆంగ్ల భాష నైపుణ్యం పెంచేందుకు టోఫెల్‌ పరీక్ష నిర్వహిస్తామని, ప్రతిభ చూపిన విద్యార్ధులను అమెరికాకు శిక్షణకు పంపిస్తామన్నారు. 3-5 తరగతులకు టోఫెల్‌ ప్రాథమిక, 6-9 తరగతులకు జూనియర్‌, ఆ తర్వాత ఇంటర్మీయట్‌కు స్యాట్‌, డిగ్రీలో జీఆర్‌ఈ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను పాఠశాల స్థాయిలో జూన్‌ 12న, రాష్ట్ర స్థాయిలో 20న సన్మానిస్తామన్నారు. మొదటి స్థానానికి రూ.3వేలు, ద్వితీయ రూ.2వేలు, తృతీయ రూ.వెయ్యి నగదు బహుమతి అందిస్తాం. ఈ ఏడాది డిసెంబరులో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తాం’ అని మంత్రి బొత్స వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!