AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: భర్త వేధింపులతో ఇల్లు విడిచి వచ్చిన మహిళకు అనుకోని కష్టాలు.. పాపం

Visakha railway station : విశాఖలో ఏడాదిన్నర బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతుంది. భర్తపై అలిగి రైలు ఎక్కి బిడ్డతో కలిసి యాదాద్రి నుంచి విశాఖ వచ్చింది మహిళ. రాత్రి రైల్వే స్టేషన్‌లో నిద్రించిన సమయంలో ఆమె కొడుకును కిడ్నాప్ చేశారు దుండగులు.

Vizag: భర్త వేధింపులతో ఇల్లు విడిచి వచ్చిన మహిళకు అనుకోని కష్టాలు.. పాపం
Kid Kidnap
Ram Naramaneni
|

Updated on: Jun 09, 2023 | 3:31 PM

Share

యాదాద్రి భువనగిరి జిల్లా కాప్రాయపల్లికి చెందిన కొంగర భవాని..  కుటుంబ కలహాలు, భర్త వేధింపులు నేపథ్యంలో 18 నెలల కుమారుడు విజయ్‌కుమార్‌‌తో కలిసి రైలు ఎక్కి విశాఖ వరకు వచ్చేసింది. రైలు దిగిన తర్వాత ప్లాట్‌ఫార్మ్‌ నెంబర్ 8లో కొడుకుతో నిద్రించింది ఆ తల్లి… కాసేపటికి మేలుకొని చూస్తే బాలుడు మాయం అయ్యాడు..చుట్టుపక్కల వెతికిన కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది..స్టేషన్ మొత్తం గాలించినా ఫలితం లభించలేదు.

అయితే ఆమె నిద్రపోవడానికి కొంత సమయం ముందు..ఓ జంట తనతో మాట్లాడినట్లు విచారణలో చెప్పింది భవాని..వాళ్లే బాలుడును ఎత్తుకొని వెళ్లి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది..బాలుడు నీలిరంగు నైట్ ప్యాంటు నలుపు రంగు స్లీవ్ లెస్ బనియన్ ధరించాడని ఆమె చెప్పింది. ఐతే భవాని  ఏడు నెలల గర్భిణీ కావడంతో ఆసుపత్రికి తరలించి…కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు పోలీసులు..

ఇక కిడ్నాప్ కేసు నమోదు చేసి బాలుడు, నిందితుల కోసం ఆరు ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో నాణ్యత లేకపోవడం పైగా, సంఘటన జరిగిన ప్రాంతంలో కెమెరాలు లేకపోవడం దర్యాప్తులో ఆటంకంగా మారింది. తల్లికి టీలో మత్తుమందు ఇచ్చి ఆపై బాలుడిని ఎత్తుకెళ్లినట్టు అనుమానిస్తున్నారు. అదృశ్యమైన చిన్నారి కోసం కంటతడి పెడుతుంది ఆ తల్లి. నా బాబు పాలు కోసం ఏడుస్తుంటాడని..ఎక్కడున్నాడో ఏమయ్యాడో ఎలా ఉన్నాడో తెలియడం లేదంటున్నారు తల్లి భవాని. తన బాబును తన వద్దకు చేర్చాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది భవాని.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా