AP BJP: ఏపీలో స్పీడు పెంచిన బీజేపీ.. 18 గంటల్లోనే రెండు భారీ బహిరంగ సభలు

Amit Shah - JP Nadda : ఇప్పటివరకు ఒక లెక్క. ఇప్పటి నుంచి ఒక లెక్క. ఏపీపై స్పెషల్ ఫోకస్ పెంచింది బీజేపీ. అగ్ర నేతలతో 18 గంటల వ్యవధిలో 2 భారీ బహిరంగ సభలు నిర్వహించబోతుంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

AP BJP: ఏపీలో స్పీడు పెంచిన బీజేపీ.. 18 గంటల్లోనే రెండు భారీ బహిరంగ సభలు
JP Nadda - Amit Shah
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 09, 2023 | 5:13 PM

ఇంకో ఆరు నెలల్లో తెలంగాణ ఎన్నికలు.. ఆ తర్వాత ఆరు నెలల్లో ఏపీ ఎన్నికలు.. సో.. సమయం లేదు మిత్రమా అంటోంది బీజేపీ. తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర బీజేపీ నేతలు వరుస షెడ్యూల్స్ ఫిక్స్ చేసుకుని రాజకీయ వేడిపుట్టిస్తున్నారు. ఏపీలో 18 గంటల్లోనే రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించబోతోంది బీజేపీ. ఈ నెల 10న శ్రీకాళహస్తికి వస్తున్నారు. ఆ తర్వాత రోజే.. అంటే 11న విశాఖకి అమిత్ షా రాబోతున్నారు. ఇక ఈ నెల 15న ఖమ్మం జిల్లాలో అమిత్ షా పర్యటించబోతుండగా.. 25న నాగర్‌కర్నూల్‌లో ల్యాండ్ కాబోతున్నారు నడ్డా. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం తీసుకొస్తున్నారు.

నడ్డా పర్యటన నేపథ్యంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఇప్పటికే కాషాయమయం అయింది. శ్రీకాళహస్తి ముఖద్వారం నుంచి, రామ సేతు వంతెన, నాలుగుమాఢ వీధులు, పెళ్లి మండపం, బేరి వారి మండపం వరకు కాషాయ జెండాలతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తితో పాటు విశాఖ సభలను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు

పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. బీజేపీ నేతలు స్పీడ్ పెంచారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాలపైనా స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. అటు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా.. కేంద్ర మంత్రి అమిత్‌షా వరుస పర్యటనలు కాకరేపుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం