Viveka Murder Case: వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటీషన్ కొట్టివేత.. సీబీఐతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు..
Viveka Murder Case: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన నాంపల్లి సీబీఐ కోర్ట్ శుక్రవారం కొట్టివేసింది. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్ష్యులను, దర్యాప్తును
Viveka Murder Case: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన నాంపల్లి సీబీఐ కోర్ట్ శుక్రవారం కొట్టివేసింది. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్ష్యులను, దర్యాప్తును ప్రభావితం చేయగలరనే సీబీఐ వాదనతో సదరు కోర్టు ఏకీభవించింది.
కాగా, వైఎస్ భాస్కర్ రెడ్డికి ఆనారోగ్యం దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలంటూ అంతకముందు ఆయన తరఫున లాయర్ ఉమామహేశ్వర్ రావు సదరు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ, ఈ కేసులో ఇంప్లీడ్ అయిన వైఎస్ సునీత మంగళవారం తమ తమ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలను పరిశీలించిన కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే నేడు విచారణ జరగ్గా.. ఇరు వర్గాల వాదనలు విన్న సీబఐ కోర్టు భాస్కర్ రెడ్డి వాయిదా పిటీషన్‌ని కొట్టివేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..