WTC Final 2023: ‘కంగారులను టీమిండియా ఓడించాలని ఆశపడుతున్నా’.. టెస్ట్ ఫైనల్‌పై ఇంగ్లాండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు..

WTC Final 2023: లండన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. అయితే మ్యాచ్‌కి ముందు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను ఓ ఇంగ్లీష్‌మ్యాన్ అయినప్పటికీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలవాలని కోరుకుంటున్నానని..

WTC Final 2023: ‘కంగారులను టీమిండియా ఓడించాలని ఆశపడుతున్నా’.. టెస్ట్ ఫైనల్‌పై ఇంగ్లాండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు..
IND vs AUS, WTC Final 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 07, 2023 | 6:18 PM

WTC Final 2023: లండన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలనే పట్టుదలతో ఇరు జట్లు బరిలోకి దిగాయి. మ్యాచ్‌కి ముందు టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోవడంతో ఆసీస్ టీమ్ బ్యాటింగ్ చేస్తోంది. ఇదిలా ఉంటే మ్యాచ్‌కి ముందు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను ఓ ఇంగ్లీష్‌మ్యాన్ అయినప్పటికీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలవాలని కోరుకుంటున్నానని చెప్పుకోచ్చాడు. గ్రేమ్ స్వాన్ మాట్లాడుతూ ‘భారత జట్టు గత పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీలు గెలవడంలో ఇబ్బంది పడుతోంది. ఆసీస్‌ జట్టులో లాగానే ఆ జట్టులో కూడా సూపర్ పేసర్లు ఉన్నారు. కాబట్టి ఎవరు గెలుస్తారనేది ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ ఓ ఇంగ్లిష్‌మ్యాన్‌గా భారత్ గెలుస్తుందని నా అంచనా. కంగారుల జట్టును టీమిండియా ఓడిస్తే చూడాలని ఆశపడుతున్నా’ అని తెలిపాడు.

అయితే మ్యాచ్ ప్రారంభం కాకముందే ఓవల్ పిచ్ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా నలుగురు సీమర్లతో బరిలోకి దిగుతుందనే వార్తలు వచ్చాయి. వీటిపై స్పందించిన స్వాన్ ‘ఓవల్‌లో బౌలర్లకు అక్కడ లభించే బౌన్స్ ప్లస్ పాయింట్. ఇది దాదాపుగా ముంబై వాంఖడేలోని పిచ్‌లా ఉంటుంది. సిల్లీ పాయింట్, షార్ట్ లెగ్‌లో ఉండే ఫీల్డర్లను ముందుకు తీసుకొస్తే.. స్పిన్నర్లు కూడా మెరుగ్గా రాణించగలరు.’ అని చెప్పుకొచ్చాడు. అలాగే ‘చివరి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరును డిఫెండ్ చేసుకోవాల్సి వస్తే స్పిన్నర్లను ఆడించాలి, స్పిన్ బౌలింగ్ చేయడానికి కూడా ఇది చాలా మంచి పిచ్’ అని స్వాన్ అభిప్రాయపడ్డాడు.

కాగా, మ్యాచ్‌కి ముందు వచ్చిన వార్తలు నిజమయ్యాయి. రవిచంద్రన్ అశ్విన్ లేకుండానే టీమిండియా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. మరోవైపు 28 ఓవర్ల ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేశారు. ఓపెనర్లుగా వచ్చిన ఉస్మాన్ ఖవాజా ఖాతా తెరవకుండానే వెనుదిరగ్గా.. డేవిడ్ వార్నర్(43) పర్వాలేదనిపించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మార్నస్ లబుషెన్(26) కూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఇక క్రీజులో స్టీవ్ స్మిత్(12), ట్రావిస్ హెడ్వ(13) ఉన్నారు. భారత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి, శార్దుల్ ఠాకూర్ తలో వికెట్ తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ తుది జట్లు

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్) శుభమాన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కెఎస్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా: ప్యాట్ కమ్మిన్స్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు అనుకూల సమయం..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు అనుకూల సమయం..
హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా