- Telugu News Photo Gallery Safe and Economical home remedies To Remove Hair Colour permanently At Home
Hair Colour Remove: హెయిర్ కలర్ నచ్చలేదా..? ఏం పర్వాలేదు, ఇంట్లోనే జుట్టు రంగును తేలిగ్గా తొలగించండిలా..!
Hair Colour Remove: చాలా మంది తమ జుట్టు ఆకర్షణీయంగా కనిపించాలనే కోరికతో హెయిర్ కలర్ చేయిస్తు్ంటారు. అయితే అలా చేయించుకున్నవారిలో కొద్ది మంది మళ్లీ మనసు మార్చుకుని కలర్‌ని తొలగించుకోవాలని భావిస్తుంటారు. అందుకోసం సెలూన్ లేదు పార్లర్‌కి వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేస్తుంటారు.
Updated on: Jun 06, 2023 | 4:28 PM

అయితే కొన్ని పద్ధతులను పాటించడం ద్వారా అలాంటి ఖర్చు లేకుండానే మీ జుట్టుకు ఉన్న కలర్‌ని తొలగించుకోవచ్చు. పైగా మీ జుట్టు కూడా సురక్షితంగా ఉంటుంది. మరి హెయిర్ కలర్‌ని ఏయే పద్ధతులలో తొలగించుకోవచ్చునో ఇప్పుడు చూద్దాం..

హెయిర్ కలర్‌ని తొలగించుకోవడానికి.. 1/2 కప్పు నీటిలో 2 టీస్పూన్ల బేకింగ్ సోడా కలిపి, దాన్ని మీ జుట్టుకు అప్లై చేయండి. అలా చేసిన కొంత సమయం తర్వాత మీ జుట్టును కడగాలి. ఆపై 1 కప్పు నీటిలో 5 చుక్కల కొబ్బరి నూనె, 1 టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు బాగా పట్టించండి. 10 నిమిషాలు అలాగే ఉంచి మీ జుట్టును కడగాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయవచ్చు.

నిమ్మరసం కూడా మీ జుట్టు రంగును తేలికపరుస్తుంది. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉన్నందున.. ఇది జుట్టు రంగును తేలికగా మార్చడంలో సహాయపడుతుంది. అందుకోసం నిమ్మరసం తీసుకుని నేరుగా జుట్టుకు పట్టించి.. ఒక గంట తర్వాత మీ జుట్టును కడగాలి.

మీరు బేకింగ్ సోడాతో కలిపిన నిమ్మరసాన్ని కూడా హెయిర్ రిమూవల్‌గా ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడా, నిమ్మరసం సమాన పరిమాణంలో మిక్స్ చేసి మీ జుట్టుకు అప్లై చేయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ హెయిర్ కలర్ క్రమక్రమంగా తొలగిపోతుంది.

డిష్ సోప్ కూడా జుట్టు రంగును తేలికపరచడంతో ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడా, యాంటీ డాండ్రఫ్ షాంపూతో లిక్విడ్ డిష్ సోప్ కలపి పేస్ట్‌ను తయారు చేయండి. దీన్ని మీ జుట్టుకు అప్లై చేసి.. ఓ 20 నిమిషాల తర్వాత మీ జుట్టును సాధారణ నీటితో కడగాలి.

మీరు డిష్ సబ్బును ఉపయోగించకూడదనుకుంటే.. మీరు బేకింగ్ సోడా, యాంటీ డాండ్రఫ్ షాంపూని కూడా పేస్ట్ చేయవచ్చు. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి 20 నిమిషాలు తర్వాత మీ జుట్టును కడగాలి.





























