Video: వాట్ ఏ క్యాచ్.. ఒంటి చేత్తో ఒడిసి పట్టిన తెలుగబ్బాయి.. వార్నర్ డ్రీమ్‌కు డ్యామేజ్.. వీడియో
WTC Final 2023 AUS vs IND: 22వ ఓవర్ నాలుగో బంతికి డేవిడ్ వార్నర్‌ను శార్దూల్ ఠాకూర్ అవుట్ చేశాడు. ఠాకూర్ షార్ట్ లెంగ్త్ బౌన్సర్‌ను వార్నర్ లెగ్ స్టంప్ వైపు ఆడాడు. అయితే, ఈ బాల్ కీపర్ భరత్‌కు చాలా దూరం వెళ్తున్నట్లుగా అనిపించింది. వచ్చిన అవకాశాన్ని వదులుకోని కేఎస్ భరత్.. కుడివైపు డైవింగ్ చేసి..

Srikar Bharat Stunning Catch Video: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య ఓవల్ మైదానంలో జరుగుతోంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో మొదటి సెషన్ ముగిసే అంటే లంచ్ సమయానికి ఆస్ట్రేలియా టీం రెండు వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. మార్నస్ లాబుషాగ్నే 26, స్టీవ్ స్మిత్ 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
అయితే, ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్న తెలుగు అబ్బాయి కేఎస్ భరత్.. కళ్లు చెదిరే ఆటతో ఆకట్టుకుంటున్నాడు. దీంతో భరత్‌ను ఎంచుకోవడం మంచి పనైందంటూ నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. రెండు వికెట్లలో తన భాగస్వామ్యం ఉంది. ముఖ్యంగా డేవిడ్ వార్నర్(43) వికెట్‌ను పడగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు.




22వ ఓవర్ నాలుగో బంతికి డేవిడ్ వార్నర్‌ను శార్దూల్ ఠాకూర్ అవుట్ చేశాడు. ఠాకూర్ షార్ట్ లెంగ్త్ బౌన్సర్‌ను వార్నర్ లెగ్ స్టంప్ వైపు ఆడాడు. అయితే, ఈ బాల్ కీపర్ భరత్‌కు చాలా దూరం వెళ్తున్నట్లుగా అనిపించింది. వచ్చిన అవకాశాన్ని వదులుకోని కేఎస్ భరత్.. కుడివైపు డైవింగ్ చేసి, ఒంటి చేత్తో అద్భుత క్యాచ్ పట్టాడు. దీంతో రోహిత్ సేన ఆనందంలో మునిగిపోయేలా చేశాడు.
View this post on Instagram
భారత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీ వైపు దూసుకెళ్తున్న సమయంలో వార్నర్‌ను పెవిలియన్ చేర్చిన కేఎస్ భరత్, భారత శిబిరంలో ఆనందంలో నింపేలా చేశాడు. అసలే ఫాంలో లేని డేవిడ్ వార్నర్.. చాలా కసితో బ్యాటింగ్ చేస్తున్నాడు. టీంలో తన స్థానాన్ని పదిలం చేసుకునే క్రమంలో భారీ ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. కానీ, శార్దుల్, కేఎస్ భరత్ రూపంలో వార్నర్ మామ కలలకు బ్రేకు పడింది.
ఇరుజట్లు:
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, శ్రీకర్ భరత్(కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
