AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: 50 ఏళ్ల సినీ కెరీర్‌కు రజని త్వరలో గుడ్ బై? ఆ సినిమానే చివరిది అంటూ డైరెక్టర్ హింట్..

కెరీర్ లో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ అందుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ చివరి సినిమా అంటూ గత 20 ఏళ్లుగా వినిపిస్తోన్న మాట.. రజని కాంత్ హీరోగా 20 ఏళ్లు క్రితం నటించిన బాబా సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజై.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో అప్పట్లో రజని కాంత్ తాను ఇక సినిమాల్లో నటించను అని ప్రకటించి సంచలనం సృష్టించాడు.

Rajinikanth: 50 ఏళ్ల సినీ కెరీర్‌కు రజని త్వరలో గుడ్ బై? ఆ సినిమానే చివరిది అంటూ డైరెక్టర్ హింట్..
Rajani Kanth
Surya Kala
|

Updated on: May 18, 2023 | 11:22 AM

Share

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ పేజీని లిఖించుకున్న హీరో రజనీకాంత్. 50 ఏళ్ల క్రితం వెండి తెరపై అడుగు పెట్టిన రజనీకాంత్ కెరీర్ మొదట్లో వెండి తెరపై చిన్న చిన్న పాత్రలను వేస్తూ.. హీరోగా .. సూపర్ స్టార్ గా ఖ్యాతిగాంచారు. రజనీకాంత్ కు దేశంలో మాత్రమే కాదు.. జపాన్ వంటి ఇతర దేశాల్లో కూడా అభిమానులున్నారు. కెరీర్ లో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ అందుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ చివరి సినిమా అంటూ గత 20 ఏళ్లుగా వినిపిస్తోన్న మాట.. రజని కాంత్ హీరోగా 20 ఏళ్లు క్రితం నటించిన బాబా సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజై.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో అప్పట్లో రజని కాంత్ తాను ఇక సినిమాల్లో నటించను అని ప్రకటించి సంచలనం సృష్టించాడు. తర్వాత మనసు మార్చుకుని మళ్ళీ వరస సినిమాల్లో నటిస్తూ.. రోబో వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు.

ప్రస్తుతం రజనీకాంత్ తన 170 వ సినిమా జైలర్ షూటింగ్ తో బిజీబిజీగా ఉన్నారు. అనంతరం రజనీ, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో నటించనున్నారు. అయితే ఈ సినిమానే తలైవా రజని కెరీర్ లో చివరి సినిమా అనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. అంతేకాదు రజని చివరి సినిమా అంటూ తమిళ డైరెక్టర్ మిస్కిన్ చెప్పడంతో ప్రస్తుతం ఈ మాట సర్వాత్రా చక్కర్లు కొడుతోంది.

డైరెక్టర్ మిస్కిన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తలైవా రజనీకాంత్ లాస్ట్ మూవీపై స్పందించాడు. రజని కెరీర్ లో 171వ సినిమా..  50 దశాబ్దాల రజనీ కెరీర్ తన 171 సినిమాతో  గుడ్ బై చెబుతారని తాను భావిస్తున్నట్లు మిస్కిన్ చెప్పడం విశేషం. అంతేకాదు.. లోకేష్ తో సినిమా చేయడం కోసం రజనీయే ఆసక్తి చూపాడని.. అంతేకాదు తానే స్వయంగా సినిమా చేద్దామని అడిగినట్లు మిస్కిన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే రజనీ, లోకేష్ కాంబినేషన్ పై ఫ్యాన్స్ లో భారీ రేంజ్ లో అంచనాలున్నాయి. ఇక ఈ సినిమానే రజని కెరీర్ లో లాస్ట్ సినిమా అన్న విషయం వెలుగులోకి వస్తే.. మరి అభిమానుల ఆదరణ మరింత పెరగడం ఖాయం. లోకేష్ కనగరాజ్ ఇప్పటికే కమల్ హాసన్ కు విక్రమ్ వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో