AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upasana Konidela: నాబిడ్డకు పరిపూరణమైన ప్రేమను అందించడానికి సిద్ధంగా ఉన్నా.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్..

ఎందుకంటే ప్రేమంటేనే అమ్మ. అమ్మంటేనే ప్రేమ. అమ్మ, ప్రేమ... అక్షరమొక్కటే తేడా. పలకడంలో.. ఫీలింగ్‌ మాత్రం సేమ్‌ టు సేమ్‌. ఈ రోజు మాతృదినోత్సవం సందర్భంగా మెగా కోడలు ఉపాసన కొణిదెల బేబీ బంప్ తో ఉన్న లేటెస్ట్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

Upasana Konidela: నాబిడ్డకు పరిపూరణమైన ప్రేమను అందించడానికి సిద్ధంగా ఉన్నా.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్..
Upasanas Konidela
Surya Kala
|

Updated on: May 14, 2023 | 12:16 PM

Share

అమ్మతనంలోని కమ్మదనాన్ని తెలియజేస్తూ.. మాతృదినోత్సవ వేడుకను సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఘనంగా జరుపుకుంటున్నారు. తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి మరో జీవికి ప్రాణంపోసి.. కష్టన్ని ఇష్టంగా భరించేది అమ్మ.. అందుకే పుట్టుక మనది.. బతుకు మనది.. చావూ మనది.. కానీ మనమెప్పుడు నవ్వుతూ ఉండాలన్న ఆలోచన అమ్మది. తన బిడ్డలుగా మనమెప్పుడూ ఆకాశమంత ఎత్తుకు ఎదగాలన్న తపన తల్లిది. అందుకే, ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే. ఆమె ముందు మనమెప్పుడూ పసిపిల్లలమే. కొంగుచాటు సంటోళ్లమే. ప్రేమను పంచడంలో అమ్మ తర్వాతే ఎవరైనా..? ఆ మాట చెప్పడానికి కవులే కానక్కర్లా? కవితలు రాయక్కర్లా? ఎందుకంటే ప్రేమంటేనే అమ్మ. అమ్మంటేనే ప్రేమ. అమ్మ, ప్రేమ… అక్షరమొక్కటే తేడా. పలకడంలో.. ఫీలింగ్‌ మాత్రం సేమ్‌ టు సేమ్‌. ఈ రోజు మాతృదినోత్సవం సందర్భంగా మెగా కోడలు ఉపాసన కొణిదెల బేబీ బంప్ తో ఉన్న లేటెస్ట్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 8వ నెల గర్భంతో ఉన్న ఉపాసన .. పిక్చర్‌లో చిరునవ్వుతో తన బేబీ బంప్‌ను ప్రదర్శిస్తోంది.

అంతేకాదు తాను అమ్మ అవుతున్న సందర్భాన్ని ఎంజాయ్ చేస్తున్నానని.. మాతృత్వాన్ని స్వీకరించడానికి ఎంతో గర్వపడుతున్నానని చెప్పారు ఉపాసన. అంతేకాదు తాను మాతృత్వాన్ని వారసత్వం కొనసాగించడానికో.. లేదా మా వివాహ బంధం బలోపేతం కావాలనో కోరికతోనే స్వీకరించలేదన్నారు. తాను పెళ్లి అయిన తర్వాత.. ఎప్పుడైతే.. పరిపూర్ణంగా తన బిడ్డ మంచి చెడులను చేసుకోగలను అనే ఫీల్సింగ్ తో పాటు.. తన పుట్టబోయే పిల్లలకు ఎటువంటి కండిషన్స్ లేకుండా ప్రేమని, సంరక్షణని అందించగలనో అప్పుడే తల్లి కావాలని.. అందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడే పిల్లలను కనాలని  నిర్ణయించుకున్నానని గుర్తు చేసుకుంది ఉపాసన.

ఇవి కూడా చదవండి

తాను గర్భిణీగా మొదటిసారి మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నాను అంటూ .. బ్లాక్ డ్రెస్ లో బేబీ బంప్ తో ఉన్న ఫోటోని షేర్ చేసింది ఉపాసన.. ఇప్పటికే ఈ ఫోటో మెగా అభిమానులు షేర్ చేస్తే తెగ సంగతి చేస్తున్నారు.. వదినమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు.

మరోవైపు ఉపాసన గర్భవతి అయినప్పటి నుంచి రామ్ చరణ్ తన భార్యను ఎంతో అపురూపంగా చూసుకుంటున్న సంగతి తెలిసిందే.. ఎక్కడి వెళ్లినా భార్యను తీసుకునే వెళ్తున్నాడు. తరచుగా విహార యాత్రలు చేస్తూ.. గర్భవతి అయిన భార్యతో గడుపుతున్నాడు. రామ్ చరణ్ , ఉపాసన 2012 లో వివాహం చేసుకున్నారు. 10 సంవత్సరాల  తర్వాత ఈ జంట తమ నవజాత శిశువును స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు.

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..