Odisha Train Accident: సీఎం సహాయ నిధికి విరాట్ కోహ్లీ రూ.30 కోట్ల విరాళం..? క్లారిటీ ఇదిగో..

Odisha Train Accident: ఒడిశాలో గత శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి తెలిసిందే. ఇప్పటివరకు దాదాపు 278 మంది ప్రయాణికులు ఈ రైల్వే ప్రమాదంలో మరణించారు. అలాగే గాయాల పాలైనవారు స్థానికి హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఓడిశా..

Odisha Train Accident: సీఎం సహాయ నిధికి విరాట్ కోహ్లీ రూ.30 కోట్ల విరాళం..? క్లారిటీ ఇదిగో..
Fake Post; Virat Kohli
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 06, 2023 | 4:01 PM

Odisha Train Accident: ఒడిశాలో గత శుక్రవారం జరిగిన ఘోర రై ప్రమాదం గురించి తెలిసిందే. ఇప్పటివరకు దాదాపు 278 మంది ప్రయాణికులు ఈ రైలు ప్రమాదంలో మరణించారు. అలాగే గాయాల పాలైనవారు స్థానికి హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఓడిశా సహాయ నిధికి విరాట్ కోహ్లీ రూ. 30 కోట్లు విరాళంగా ఇచ్చాడని నెట్టింట ఓ వార్త తెగ హల్చల్ చేస్తోంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన కోహ్లీకి ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఇలా చేశాడని కూడా ప్రచారం సాగుతోంది.

అయితే .. రైల్వే ప్రమాదం గురించి తెలుసుకున్న కోహ్లీ మరణించినవారి పట్ల దిగ్బ్రాంతి చెందానని, గాాయాలపాలైనవారు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లుగా మాత్రమే ట్వీట్ చేశాడు. అంతేకానీ విరాళం చేశానని ఎక్కడా ప్రకటించలేదు. అంటే కోహ్లీ విరాళం చేశాడని వస్తున్న వార్త పూర్తిగా అబద్దం మాత్రమే. నిజానికి కోహ్లీ రూ.30 కోట్లు విరాళం చేశాడనే పోస్ట్‌  the.cricket_network అనే క్రికెట్ ఫ్యాన్ అకౌంట్ నుంచి షేర్ అయింది. పైగా విరాట్ కోహ్లీ నుంచి విరాళం గురించి ఎక్కడా అధికారిక ప్రకటన లేదు.

ఇవి కూడా చదవండి

ఓడిశా రైలు ప్రమాదంపై కోహ్లీ స్పందన

విరాట్ కోహ్లీ విరాళం చేసినట్లు వస్తున్న ఫేక్ పోస్ట్

కాగా, విరాట్ కోహ్లీతో సహా పలువురు క్రికెటర్లు ఓడిశా రైలు ప్రమాదంలో దుర్మరణం చెందినవారి పట్ల సంతాపం తెలిపారు. అలాగే టీమిండియా డాషింగ్ ఓపెనర్ విరేంద్ర సెహ్వాగ్ ప్రమాదంలో మరణించినవారి పిల్లలకు విద్యనందిస్తానని ప్రకటించాడు. ఇదిలా ఉండగా.. లండన్‌లోని ఓవల్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపు ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ప్రారంభం కానుంది. ఇంకా ఇప్పటికే ఓ సారి న్యూజిలాండ్ చేతిలో తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ ఓడిన భారత్.. ఈ సారి ఎలా అయినా ట్రోఫీ గెలవాలనే పట్టుదల మీద ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..