- Telugu News Photo Gallery Cricket photos WTC Final 2023: Team India Captain Rohit Sharma 1 Sixer Away to break Sachin Tendulkar's Test Cricket Record
WTC Final 2023: టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా సిక్సర్ కింగ్ అతనే..! రెండో స్థానంలో ఎంఎస్ ధోని.. అగ్రస్థానం ఎవరిదంటే..?
WTC Final 2023: అందరూ ఎంతగానో ఎదురుచూస్తోన్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. ఓవల్ వేదికా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఓ సిక్సర్ కొడితే చాలు.. సచిన్ పేరిట ఉన్న టెస్ట్ క్రికెట్ సిక్సర్ల రికార్డ్ బద్దలవుతుంది.
Updated on: Jun 06, 2023 | 2:49 PM

WTC ఫైనల్ 2023: భారత్, ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి 5 రోజుల పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఒక్క సిక్సర్ బాదితే.. టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్‌ని అధిగమించగలడు.

టీమిండియా తరఫున మొత్తం 329 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ మొత్తం 69 సిక్సర్లు బాదాడు. అలాగే ఇప్పటివరకు 83 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ 69 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో సచిన్ రికార్డును బద్దలు కొట్టాలంటే హిట్‌మ్యాన్ కేవలం ఒక్క సిక్స్ కొడితే చాలు.

అయితే టెస్టు క్రికెట్‌లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్ల రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. మొత్తం 180 టెస్టులు ఆడిన వీరూ 91 సిక్సర్లు బాది ఈ రికార్డు సృష్టించాడు.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా 2వ స్థానంలో ఉన్నాడు. ధోని 144 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 78 సిక్సర్లు బాదాడు.

329 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 69 సిక్సర్లు బాదిన సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

83 ఇన్నింగ్స్‌ల్లో 69 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్నాడు.

అలాగే 184 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 61 సిక్సర్లు బాదిన టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు.




