MS Dhoni: కూల్‌ కెప్టెన్‌ని కలిసిన ‘మిస్టర్ డిపెండబుల్’.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు.. క్యాప్షన్ చూస్తే కిర్రాక్ అంతే..

MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూప‌ర్ కింగ్స్‌ సారథి మ‌హేంద్ర సింగ్ ధోనీ మోకాలి సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల క్రితం ఆపరేషన్ జరగ్గా.. అప్పటినుంచి ధోని ముంబైలోనే ఉన్నాడు. ఇక ఈ రోజు తన ఇంటికి..

MS Dhoni: కూల్‌ కెప్టెన్‌ని కలిసిన ‘మిస్టర్ డిపెండబుల్’.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు.. క్యాప్షన్ చూస్తే కిర్రాక్ అంతే..
MS Dhoni and Mohammad Kaif Family Photo
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 05, 2023 | 10:03 PM

MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూప‌ర్ కింగ్స్‌ సారథి మ‌హేంద్ర సింగ్ ధోనీ మోకాలి సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల క్రితం ఆపరేషన్ జరగ్గా.. అప్పటినుంచి ధోని ముంబైలోనే ఉన్నాడు. ఇక ఈ రోజు(సోమవారం) తన ఇంటికి బయలు దేరిన ధోనికి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తన చిరకాల మిత్రుడు కలిశాడు. ఫ్యామిలీతో సహా ముంబై నుంచి రాంచీకి బయలుదేరిన వెళ్తున్న ధోనిని టీమిండియా మాజీ క్రికెటర్ మ‌హ‌మ్మ‌ద్ కైఫ్ కలిశాడు. ఈ సందర్భంగా ధోని ఫ్యామిలీతో, ఇంకా తన కొడుకుతో కలిసి కైఫ్ ఫోటోలు దిగాడు.

అయితే కైఫ్ ఆ ఫోటోలను నెట్టింట పోస్ట్ చేయగా.. అవి కాస్త ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇంకా కైఫ్ తన పోస్ట్‌కి ‘ ముంబైలో సర్జరీ ముగిసిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్న ధోనిని, అతని కుటుంబాన్ని మేము కలుసుకున్నాము. తన చిన్నప్పుడు తాను కూడా ఓ ఫుట్‌బాల్ ప్లేయర్‌నేనని ధోని చెప్పడంతో మా అబ్బాయి కబీర్ చాలా సంతోషంగా ఉన్నాడు. త్వరగా కోలుకోండి, తదుపరి సీజన్‌లో ఛాంపియన్‌గా చూస్తా’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. 

ఇవి కూడా చదవండి

కాగా, ధోని సారథ్యంలో కూడా మహ్మద్ కైఫ్ టీమిండియా తరఫున ఎన్నో మ్యాచ్‌లను ఆడాడు. ముఖ్యంగా టీమిండియా ఫీల్డింగ్ సమయంలో ధోని, కైఫ్ మధ్య సమన్వయం క్రికెట్ అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేరు. ఆ సమయంలో వారి ఇద్దరి మధ్య ఉన్న సత్సంబంధం ఈ రోజు ఇలా మరోసారి బయటపడింది. మరోవైపు కారు ప్రమాదంలో గాయపడిన రిషభ్ పంత్‌కి ఆపరేషన్ చేసిన కోకిలాబెన్ హాస్పిటల్ డాక్ట‌ర్ దిన్‌షా పండివాలానే ధోనికి కూడా సర్జరీ చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా