AP Schools Reopen Date: ‘వేసవి సెలవుల పొడిగింపు లేనట్లే..! రేపట్నుంచి తెరచుకోనున్న బడులు’

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం (జూన్ 12) నుంచి పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి. దాదాపు 45 రోజులపాటు వేసవి సెలవులు ఎంజాయ్‌ చేసిన పిల్లలు బడులకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. సెలవుల్లో బంధువుల ఇళ్లకు వెళ్లిన పిల్లలు..

AP Schools Reopen Date: 'వేసవి సెలవుల పొడిగింపు లేనట్లే..! రేపట్నుంచి తెరచుకోనున్న బడులు'
AP Schools Reopen
Follow us

|

Updated on: Jun 11, 2023 | 4:31 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం (జూన్ 12) నుంచి పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి. దాదాపు 45 రోజులపాటు వేసవి సెలవులు ఎంజాయ్‌ చేసిన పిల్లలు బడులకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. సెలవుల్లో బంధువుల ఇళ్లకు వెళ్లిన పిల్లలు తిరిగి ఇళ్లకు వస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇంకా ఎండలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలను స్కూళ్లకు పంపడంపై తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షనాయకులు కూడా వేడిగాలులు, ఉక్కపోత కారణంగా పిల్లలు బడులకు వెళ్లడానికి ఇబ్బందిపడుతున్నారని, మరికొన్ని రోజులు సెలవులు పొడిగించమని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్​ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటినుంచి పాఠశాలలు పునఃప్రారంభించడం తథ్యం. ఐతే అందులో కొన్ని సడలింపులు చేసింది. జూన్‌ 17 వరకు రెండు పూటలు కాకుండా, కేవలం ఒంటిపూట బడులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది. అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున తల్లిదండ్రుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఒంటిపూట బడులు నిర్వహించాలని తెలుపుతూ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో ఉదయం 7 నుంచి 11:30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని అన్ని పాఠశాలలకు తెల్పింది. ఉదయం 8.30 నుంచి 9 గంటలలోపు రాగిజావ, ఉదయం 11.30 గంటలకు విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం పంపిణీ చేయాలని తెల్పింది. జూన్‌ 19 తర్వాత యథావిథిగా పాఠశాలలు రెండు పూటలా అమలుకానున్నట్లు పేర్కొంది. అలాగే జూన్‌ 12 నుంచి విద్యా కానుక కిట్ల పంపిణీ చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
ఆర్మీలో చేరాలనుకున్న అమ్మాయి హీరోయిన్ అయ్యింది..
ఆర్మీలో చేరాలనుకున్న అమ్మాయి హీరోయిన్ అయ్యింది..
విద్యార్థుల ప్రేమకు భావోద్వేగానికి లోనైన టీచర్.. ఏం చేశారంటే!
విద్యార్థుల ప్రేమకు భావోద్వేగానికి లోనైన టీచర్.. ఏం చేశారంటే!
Video: ఇది కదా ఆనందమంటే.. భాంగ్రా స్టెప్పులేసిన కోహ్లీ, అర్షదీప్
Video: ఇది కదా ఆనందమంటే.. భాంగ్రా స్టెప్పులేసిన కోహ్లీ, అర్షదీప్
మ్యాచ్‌లో ఉత్కంఠ క్షణాలు మిస్సయ్యారా.. ఈ హైలైట్స్‌ వీడియో చూడండి
మ్యాచ్‌లో ఉత్కంఠ క్షణాలు మిస్సయ్యారా.. ఈ హైలైట్స్‌ వీడియో చూడండి
ఏం తినేటట్టు లేదు.. కొండెక్కిన కూరగాయల ధరలు.. దిగిరానంటూ మారాం..!
ఏం తినేటట్టు లేదు.. కొండెక్కిన కూరగాయల ధరలు.. దిగిరానంటూ మారాం..!
400 ఆలయాలతో పేర్చినట్లు ఉండే గ్రామం ఎక్కడో తెలుసా?
400 ఆలయాలతో పేర్చినట్లు ఉండే గ్రామం ఎక్కడో తెలుసా?
అర్జునుడి పాత్ర కోసం విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఏంతంటే..
అర్జునుడి పాత్ర కోసం విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఏంతంటే..
పాలతో అందం పదిలం.. మచ్చలేని మెరిసే చర్మం కోసం ఇలా ట్రై చేయండి..!
పాలతో అందం పదిలం.. మచ్చలేని మెరిసే చర్మం కోసం ఇలా ట్రై చేయండి..!
మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: టీమిండియా క్రికెటర్లతో ప్రధాని
మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: టీమిండియా క్రికెటర్లతో ప్రధాని
రిపోర్టే కీలకం.. పోలవరానికి విదేశీ నిపుణుల బృందం..
రిపోర్టే కీలకం.. పోలవరానికి విదేశీ నిపుణుల బృందం..