Pawan Kalyan: ఓ వైపు ఏర్పాట్లు.. మరోవైపు ఆంక్షలు.. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై సస్పెన్స్..
Pawan Kalyan's Varahi Yatra: ఆంక్షలు అమలులో ఉన్నాయంటున్న పోలీసులు.. యాత్ర చేసి తీరుతామని జనసేన కార్యకర్తలు.. పవన్‌కళ్యాణ్ వారాహి టూర్ సాగుతుందా ? లేదా అనేది ఆసక్తిగా మారింది. పోలీసుల ఆంక్షలతో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర రూట్ మ్యాప్‌లో మార్పులు తప్పవా..?
Pawan Kalyan’s Varahi Yatra: ఆంక్షలు అమలులో ఉన్నాయంటున్న పోలీసులు.. యాత్ర చేసి తీరుతామని జనసేన కార్యకర్తలు.. పవన్‌కళ్యాణ్ వారాహి టూర్ సాగుతుందా ? లేదా అనేది ఆసక్తిగా మారింది. పోలీసుల ఆంక్షలతో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర రూట్ మ్యాప్‌లో మార్పులు తప్పవా..? పోలీసుల యాక్షన్‌కు జనసేన నేతల రియాక్షన్ ఏంటీ..? ఇప్పటికే వైసీపీ-జనసేన నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధం.. మధ్యలో పోలీసుల ఆంక్షలతో ఈ హీట్ పీక్స్‌కు చేరుకోనుందని అర్ధమవుతోంది. ఎన్నికల ఏడాది కావడంతో జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్.. స్పీడ్ పెంచారు. షూటింగ్‌లు పక్కన పెట్టి వరుస పర్యటనలు ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా.. వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారైంది. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ప్రత్యేక పూజల తర్వాత.. ఈనెల 14న అన్నవరం దేవస్థానం నుంచి మొదలై.. భీమవరం వరకు తొలి విడత వారాహి యాత్ర సాగనుంది. ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, నరసాపురం నియోజకవర్గాల్లో యాత్రకు జనసేన నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక ఈ నెల 21న అమలాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో జనసేన నేతలు పోస్టర్లు కూడా ఆవిష్కరించారు. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇవాళ్టి నుంచి నెలాఖరు వరకు సెక్షన్ 30 యాక్ట్ అమలులోకి వచ్చింది. అమలాపురం, కొత్తపేట డివిజన్‌లో ఆంక్షలు కొనసాగుతాయి. ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు చేయకూడదంటూ పోలీసులు ఆదేశించారు.
పవన్ కళ్యాణ్‌ను చూసి ప్రభుత్వం భయపడుతోందనీ.. అందుకే వారాహి యాత్రను అడ్డుకోవడానికి ఈ ఆంక్షలు తీసుకొచ్చారంటూ ఆరోపిస్తున్నారు జనసేన కార్యకర్తలు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కోనసీమలో వారాహి యాత్ర, అమలాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించి తీరుతామంటున్నారు.
వారాహి యాత్రను ఆపడానికి ప్రయత్నిస్తే పెద్ద ఉద్యమం అవుతుందని హెచ్చరిస్తున్నారు జనసేన నేతలు. కోనసీమ జిల్లాలో సెక్షన్ 30 యాక్ట్ అమలుతో వారాహి యాత్రపై సస్పెన్స్ కొనసాగుతోంది. ముందుగా ఖరారు చేసినట్టుగానే యాత్ర సాగుతుందా? లేదంటే పోలీసుల ఆంక్షలతో రూట్ మ్యాప్ మారుతుందా అనేది చూడాలి మరి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..