AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: గుడిలో నమాజ్‌ చేశాడని వ్యక్తి అరెస్ట్..! 

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి గుడిలో నమాజ్‌ చేసినందుకు పోలీసులు శనివారం (జూన్‌ 10) అరెస్ట్‌ చేశారు. హాపూర్‌లోని శ్రీ సిద్ధ్‌పీఠ్ చండీ ఆలయ ఆవరణలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు'నమాజ్' చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు.

Uttar Pradesh: గుడిలో నమాజ్‌ చేశాడని వ్యక్తి అరెస్ట్..! 
Namaz At Temple
Srilakshmi C
|

Updated on: Jun 11, 2023 | 3:23 PM

Share

లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి గుడిలె నమాజ్‌ చేసినందుకు పోలీసులు శనివారం (జూన్‌ 10) అరెస్ట్‌ చేశారు. హాపూర్‌లోని శ్రీ సిద్ధ్‌పీఠ్ చండీ ఆలయ ఆవరణలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు’నమాజ్’ చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. దీంతో పోలీసులు శనివారం అతన్ని అరెస్టు చేసిశారు. హాపూర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) అభిషేక్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం..

యూపీలోని హాపూర్‌లోని శ్రీ సిద్ధ్‌పీఠ్ చండీ ఆలయంలోకి అన్వర్ అనే వ్యక్తి శుక్రవారం ఉదయం ప్రవేశించాడు. అనంతరం ఆలయంలో హారతి ఇస్తున్న సమయంలో నిందితుడు నేలపై గుడ్డ పరిచి ‘నమాజ్’ చేయడం ప్రారంభించాడు. వెంటనే పూజారి అతన్ని అడ్డుకుని, ఆలయ ప్రాంగణం నుంచి బయటకు పంపించారు. ఈ ఘటనపై ఆలయ కమిటీ ఆఫీస్ బేరర్ సత్యనారాయణ్ అగర్వాల్ సదరు వ్యక్తిపై కొత్వాలి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించగలిగారు. ఆలయంలో నమాజ్‌ చేశాడని ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. లేదంటే బంద్‌ నిర్వహిస్తామని బెందిరింపులకు దిగారు.

దీంతో సీనియర్ పోలీసులు, పరిపాలనా అధికారులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని అదుపు చేయడానికి యత్నించారు. శనివారం నిందితుడు అన్వర్‌ను అరెస్టు చేసి విచారించారు. మత సామరస్యానికి భంగం కలిగించే కుట్ర ఏదీ జరగలేదని, ఈ విషయాన్ని పెద్దది చేయవద్దంటూ ఎస్పీ అభిషేక్ వర్మ విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.