AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lalu Prasad Yadav Birthday: 76 కేజీల లడ్డూతో లాలూ 76వ పుట్టిన రోజు వేడుకలు.. సీఎం నితీశ్ శుభాకాంక్షలు

ఆర్జేడీ అధినేత, బీహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ 76వ పుట్టిన రోజు వేడుకలు ఆదివారం (జూన్‌ 11) ఘనంగా జరిగాయి. లాలూ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలు 76 కిలోల భారీ లడ్డూతో బర్త్‌డే సెలబ్రేట్‌ చేశారు. జేడీయూ..

Lalu Prasad Yadav Birthday: 76 కేజీల లడ్డూతో లాలూ 76వ పుట్టిన రోజు వేడుకలు.. సీఎం నితీశ్ శుభాకాంక్షలు
Lalu Prasad Yadav
Srilakshmi C
|

Updated on: Jun 11, 2023 | 6:07 PM

Share

పట్నా: ఆర్జేడీ అధినేత, బీహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ 76వ పుట్టిన రోజు వేడుకలు ఆదివారం (జూన్‌ 11) ఘనంగా జరిగాయి. లాలూ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలు 76 కిలోల భారీ లడ్డూతో బర్త్‌డే సెలబ్రేట్‌ చేశారు. జేడీయూ చీఫ్ లాలన్ సింగ్, బీహార్ స్పీకర్ అవద్ బిహారీ చౌదరి తదితరులు లాలూ ప్రసాద్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలతోపాటు, స్వీట్స్‌ బహూకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు, బీహార్‌ మంత్రి తేజస్వీ యాదవ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఫోన్‌లో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నేతలు, రాజకీయ నాయకులు ట్విట్టర్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా ఫుల్వారియా గ్రామంలో లాలూ 1948లో జన్మించాడు. లాలూ తల్లిదండ్రులు కుందన్ రే, మరచియా దేవి. లాలూ ప్రసాద్ యాదవ్ తన తల్లిదండ్రుల ఆరుగురు కొడుకులలో రెండో సంతానం. విద్యాభ్యాసం తర్వాత అన్నయ్యతో కలిసి బీహార్ రాజధాని పాట్నాకు చేరుకున్న లాలూ రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకోవడం ప్రారంభించాడు. అనతికాలంలోనే బీహార్‌ పాలిటిక్స్‌లో కీలకంగా మారాడు. లాలూ తన రాజకీయ ప్రస్థానంలో ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా వివిధ పదవులను అధిరోహించారు. దాణా కుంభకోణం కేసుల్లో నేరారోపణ కారణంగా 1997లో బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. న్యాయపరమైన చిక్కులు వచ్చినప్పటికీ జనాల్లో మాత్రం చెక్కుచెదరని ప్రజాదరణ సొంతం చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

కిడ్నీ సమస్యతో బాధపడుతోన లాలూ గత సంవత్సరం డిసెంబర్‌లో సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. ఆయన కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీ దానం చేశారు. కిడ్నీ మార్పిడి తర్వాత లాలూ జరుపుకున్న తొలి పుట్టినరోజును కావడంతో బీహాకః రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ, బ్లాక్, సబ్ డివిజన్ స్థాయిలలో కూడా వేడుకలు నిర్వహించారు. ఆసుపత్రుల్లో పేద రోగులకు పండ్లు పంచిపెట్టారు. కార్యకర్తలు రక్తదానం కార్యక్రమాలు నిర్వహించారు. 2024 సెప్టెంబర్‌లో జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ కీలకంగా వ్యవహరించనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఇప్పటికే ఆర్జేడీ కసరత్తులు ప్రారంభించింది. దీనిలో భాగంగా లాలూ తాజాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.