Adipurush: ‘ఆదిపురుష్’ సినిమాలో శూర్పణఖ పాత్రలో నటించిన ఆ బ్యూటీ స్టార్ హీరోయిన్.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటంటే..

ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడని.. అద్భుతంగా నటించాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కృతిసనన్ సైతం రాఘవుడి తగిన జానకిగా నటించిందని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రావణ, హనుమ, లక్ష్మణ ఇలా తమ తమ పాత్రలలో అద్భుతంగా నటించారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Adipurush: 'ఆదిపురుష్' సినిమాలో శూర్పణఖ పాత్రలో నటించిన ఆ బ్యూటీ స్టార్ హీరోయిన్.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటంటే..
Adipurush
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 17, 2023 | 5:50 PM

ఆదిపురుష్… ఆదిపురుష్.. ఇప్పుడు దేశం మొత్తం వినిపిస్తోన్న పేరు ఇదే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తొలిరోజే ఏకంగా రూ.140 కోట్లు కలెక్షన్స్ రాబట్టి ప్రపంచంలోనే రికార్డ్ క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్డ్స్ టాక్ వస్తోంది. ఓవైపు సినిమా అద్భుతంగా ఉందని.. నెక్ట్స్ జనరేషన్ రామాయణం అని కొందరు చెబుతుండగా.. మరికొందరు మాత్రం దర్శకుడు పొరపాటు చేశాడని.. తన ఇష్టానుసారం రామాయణాన్ని తెరకెక్కించాడని వాదిస్తున్నారు. ఏదేమైనా.. కలెక్షన్స్ విషయంలో మాత్రం దూసుకుపోతుంది ఆదిపురుష్. ఇక ఈ వీకెండ్‏లో ఎక్కువగానే వసూళ్లు రానున్నాయని.. దీంతో రూ.200 కోట్ల మార్క్ క్రాస్ చేయడం ఖాయమంటున్నారు. ఇదంతా పక్కన పెడితే.. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడని.. అద్భుతంగా నటించాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కృతిసనన్ సైతం రాఘవుడి తగిన జానకిగా నటించిందని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రావణ, హనుమ, లక్ష్మణ ఇలా తమ తమ పాత్రలలో అద్భుతంగా నటించారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు అందరి దృష్టి ఆదిపురుష్ సినిమాలోని శూర్పణఖపై పడింది. రామాయణంలో శూర్పణఖ పాత్ర కీలకం. వనవాసంలో ఉన్న లక్ష్మణుడి చెంతకు చేరి మనసులో కోరిక చెప్పడం.. ఆ తర్వాత లక్ష్మణుడు ఆమె ముక్కు కత్తిరిచండం ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో శూర్పణఖ పాత్రలో కనిపించింది తేజస్విని పండిట్. ఆదిపురుష్ సినిమాలో క్రూరంగా కనిపించిన ఈ బ్యూటీ మరాఠా చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్. 2004లో అగా బాయి అరేచా అనే సినిమాతో మారాఠి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

ఇవి కూడా చదవండి

మొదిటి సినిమాలోని నెగిటివ్ షేడ్స్ ఉన్న కథానాయికగా నటించి మెప్పించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఉత్తమ నటిగా ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది. ఇక తేజస్వి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది. ఆదిపురుష్ సినిమాతో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.