Virupaksha: విరూపాక్ష సినిమాలో సంయుక్త పాత్రలో ఆ హీరోయిన్ నటిస్తే ఎలా ఉండేది.. జస్ట్ మిస్ ..
ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇందులో అద్భుతంగా నటించి అటు ప్రేక్షకులను.. ఇటు సినీ ప్రముఖులను కట్టిపడేసింది సంయుక్త. దీంతో మరోసారి తెలుగు సినీ పరిశ్రమలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా అనుకున్నది సంయుక్తను కాదట.

భీమ్లా నాయక్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త మీనన్. ఈ మూవీలో ఆమెది చిన్న పాత్రే అయినా..ప్రాధాన్యత లభించింది. ఇక తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. అంతేకాకుండా.. ఇప్పటివరకు ఈ బ్యూటీ నటించిన సినిమాలన్ని సూపర్ హిట్ అయ్యాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీ అనే పేరు సొంతం చేసుకుంది. ఇక ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన విరూపాక్ష చిత్రంలోనూ నటించి మెప్పించింది సంయుక్త. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇందులో అద్భుతంగా నటించి అటు ప్రేక్షకులను.. ఇటు సినీ ప్రముఖులను కట్టిపడేసింది సంయుక్త. దీంతో మరోసారి తెలుగు సినీ పరిశ్రమలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా అనుకున్నది సంయుక్తను కాదట.
తాజాగా ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ముందుగా హీరోయిన అనుపమ పరమేశ్వరన్ ను అనుకున్నారట. ఇక ఇదే విషయంపై కేరళ కుట్టిని సంప్రదించగా.. అప్పటికే పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఈ సినిమాకు నో చెప్పిందట. ఇక ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ సంయుక్త వద్దకు చేరింది. అలా సంయుక్త ఖాతాలో మరో హిట్టు పడింది.





Anupama
అనుపమకు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించడం ఇష్టమని గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. ఏడాది బ్యాక్ టూ బ్యాక్ డబుల్ హిట్స్ అందుకుంది అనుపమ. కార్తీకేయ 2 చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ సరసన డీజే టిల్లు స్వేర్ చిత్రంలో నటిస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




