AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal: గుడ్ బై చెప్తుందంటే.. సినిమాలు అనౌన్స్ చేస్తోన్న చందమామ.. సరికొత్త లుక్‏లో కాజల్..

ప్రస్తుతం కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న భారతీయుడు 2 చిత్రంలో నటిస్తుంది. అంతేకాకుండా... బాలకృష్ణ నటిస్తోన్న భగవంత్ కేసరి చిత్రంలోనూ ప్రధాన పాత్రలో కనిపించనుంది. అయితే కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందని.. తన కొడుకుతో పూర్తి సమయాన్ని గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల కాజల్ ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ సైతం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.

Kajal Aggarwal: గుడ్ బై చెప్తుందంటే.. సినిమాలు అనౌన్స్ చేస్తోన్న చందమామ.. సరికొత్త లుక్‏లో కాజల్..
Kajal
Rajitha Chanti
|

Updated on: Jun 17, 2023 | 4:55 PM

Share

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఆ తర్వాత చందమామ సినిమాతో హిట్ అందుకోవడమే కాకుండా.. భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగు సినీపరిశ్రమలో వరుస ఆఫర్స్ అందుకుంటూ అగ్రకథానాయికగా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరమైంది. తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న కాజల్… బాబు జన్మించాక సినీ పరిశ్రమకు దూరంగా ఉంది. ఇక ఇప్పుడిప్పుడే ఈ బ్యూటీ రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న భారతీయుడు 2 చిత్రంలో నటిస్తుంది. అంతేకాకుండా… బాలకృష్ణ నటిస్తోన్న భగవంత్ కేసరి చిత్రంలోనూ ప్రధాన పాత్రలో కనిపించనుంది. అయితే కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందని.. తన కొడుకుతో పూర్తి సమయాన్ని గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల కాజల్ ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ సైతం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. దీంతో కాజల్ నిజాంగానే సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు అనుకున్నారంత. ఈ క్రమంలో తాజాగా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచింది.

కాజల్ కెరీర్ లో 60వ సినిమాగా రాబోతున్న ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మూవీ టైటిల్, టీజర్ రేపు (ఆదివారం) విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో కారు విండో నుంచి కాజల్ గాజులు ధరించిన చేయి బయటపెట్టగా.. కార్ అద్దంలో కాజల్ లుక్ కనిపిస్తుంది. మునుపెన్నడు చూడని లుక్ లో కాజల్ ను చూపించనున్నాము అంటూ అనౌన్స్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను ఔరం ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా డైరెక్టర్, ఇతర నటీనటుల గురించి త్వరలోనే మరిన్ని వివరాలను అనౌన్స్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం కాజల్.. బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న భగవంత్ కేసరి చిత్రంలో నటిస్తుంది. ఇందులో యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలకపాత్రలో నటించనుంది. కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.